Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు శాశనసభ ఏకగ్రీవ తీర్మానం….

తెలంగాణ శాసనసభ ,శాసనమండలి ఒక్కరోజు చారిత్రిక ప్రత్యేక సమావేశం మంగళవారం జరిగింది …సమావేశంలో కులగణనకు ఆమోదం, ఎస్సీ వర్గీకరణ ఆమోదిస్తూ తీర్మానాలు చేశారు ..ఈ బిల్లులను శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టగ , మండలిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు …దేశంలోని సమగ్ర కులాగనన చేసిన రాష్ట్రంలో తెలంగాణ నిలిచిందని …రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కులగణన చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ..బీసీ లకు కులగణన ప్రకారం పథకాల అమలు , స్థానిక సంస్థల్లో , విద్య ,ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు ..

సుప్రీం కోర్ట్ తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణకు నిర్ణయం తీసుకున్నామని ఇది కూడా ఒక కమిషన్ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి సమగ్రంగా వివిధ వర్గాల అభిప్రాయాలూ తీసుకోని అమలు చేయాలనీ నిర్ణయించినట్లు తెలిపారు …సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఎస్సీ లోని మాదిగ సామజిక వర్గం సంబరాలు జరుపుకుంది … అనేక జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంద కృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ..

సభలో సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదికలపై చర్చ జరిగింది .. సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ ,దామోదర రాజనరసింహ , దుద్దిళ్ల శ్రీధర్ బాబు ,తలసాని శ్రీనివాస్ యాదవ్ , కేటీఆర్ , అక్బరుద్దీన్ ఒవైసి , పాయల్ శంకర్ ,కూనంనేని సాంబశివరావు మాట్లాడరు

శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి, కులసర్వే నివేదిక ప్రవేశ పెడుతూ , జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేశామని ప్రకటించారు.

ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసిన ప్రభుత్వం

ఎస్సీ వర్గీకరణ కమిషన్‌ సారాంశంపై ప్రభుత్వం ప్రకటన
3 గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషన్‌ సిఫారసు
ఎస్సీలలో మొత్తం 59 ఉపకులాలను గుర్తించిన వర్గీకరణ కమిషన్‌
ఎస్సీ కులాలను గ్రూప్‌- 1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు
మొత్తం 15 శాతం ఎస్సీ రిజర్వేషన్‌ను 3 గ్రూపులకు పంచుతూ సిఫారసు
గ్రూప్‌-1లోని 15 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్ సిఫారసు
గ్రూప్‌-1లోని 15 ఎస్సీ ఉపకులాల జనాభా- 3.288 శాతం
గ్రూప్‌-2 లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9 శాతం రిజర్వేషన్ సిఫారసు
గ్రూప్‌- 2లోని 18 ఎస్సీ ఉపకులాల జనాభా- 62.748 శాతం
గ్రూప్‌-3 లోని 26 ఎస్సీ ఉపకులాలకు 5 శాతం రిజర్వేషన్ సిఫారసు
గ్రూప్‌- 3లోని 26 ఎస్సీ ఉపకులాల జనాభా- 33.963 శాతం రిజర్వేషన్ సిఫారస్.

Related posts

తెలంగాణ అసెంబ్లీ వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. పోలీసుల అదుపులో కేటీఆర్‌, హ‌రీశ్‌రావు

Ram Narayana

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం

Ram Narayana

రేవంత్, అదానీ టీషర్ట్ లతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. అడ్డుకున్న పోలీసులు

Ram Narayana

Leave a Comment