Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విద్యవైపు ద్రుష్టి సారించిన రిలయన్స్ గ్రూప్స్ … చవకైన స్మార్ట్ ఫోన్లు!

విద్యవైపు ద్రుష్టి సారించిన రిలయన్స్ గ్రూప్స్ … చవకైన స్మార్ట్ ఫోన్లు
నవీ ముంబయిలో జియో ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు… నీతా అంబానీ
-విద్యా కార్యక్రమాలకు రిలయన్స్ శ్రీకారం
-నేడు రిలయన్స్ 44వ ఏజీఎం నిర్వహణ
-జియో ఇన్ స్టిట్యూట్ వివరాలు వెల్లడి
-ఈ విద్యాసంవత్సరం నుంచే కార్యకలాపాలు
-చవకైన స్మార్ట్ ఫోన్ ముఖేష్ అంబానీ
-సెప్టెంబరు 10 నుంచి అందుబాటులోకి ఫోన్
-జియో కోసం గూగుల్ ప్రత్యేకమైన ఓఎస్

 

నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 44వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ హోదాలో నీతా అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జియో ఇన్ స్టిట్యూట్ వివరాలు తెలిపారు. నవీ ముంబయిలో జియో ఇన్ స్టిట్యూట్ స్థాపిస్తున్నట్టు వెల్లడించారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ, ఈ విద్యాసంవత్సరం నుంచే జియో ఇన్ స్టిట్యూట్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. జీవితకాల శిక్షణ, అత్యున్నత ఆవిష్కరణలకు జియో ఇన్ స్టిట్యూట్ ఓ ప్రపంచస్థాయి వేదికగా నిలుస్తుందని నీతా అంబానీ అభివర్ణించారు. దీనిద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు కూడా అందిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 21 వేల మంది పిల్లలకు క్రీడల్లో శిక్షణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మహిళలు, బాలికల సాధికారతకు కృషి చేస్తామని వివరించారు. ముఖ్యంగా, గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

అంతేకాదు, కొవిడ్ తో పోరాటానికి తమ రిలయన్స్ ఫౌండేషన్ 5 కార్యాచరణలు ప్రారంభించిందని నీతా అంబానీ వెల్లడించారు. మిషన్ ఆక్సిజన్, మిషన్ కొవిడ్ ఇన్ ఫ్రా, మిషన్ అన్న సేవ, మిషన్ ఎంప్లాయీ కేర్, మిషన్ వ్యాక్సిన్ సురక్ష పేరిట ఈ ఐదు మిషన్లు కొనసాగుతాయని వివరించారు.

సెప్టెంబరులో జియో నుంచి అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్!ముఖేష్ అంబానీ

 

భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన రిలయన్స్ జియో అతి తక్కువ ధరకు లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్ ను తీసుకువస్తున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. దీని పేరు జియో ఫోన్ నెక్ట్స్. ఇంతకుముందు జియో ఫోన్ పేరిట ఫీచర్ ఫోన్ తీసుకువచ్చిన రిలయన్స్ ఇప్పుడు పూర్తిస్థాయి స్మార్ట్ ఫోన్ తో రంగంలోకి దిగుతోంది. ఈ ఏడాది సెప్టెంబరులో వినాయకచవితి సందర్భంగా దీన్ని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 10 నుంచి జియో ఫోన్ నెక్ట్స్ అందుబాటులోకి వస్తుందని రిలయన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను తెలిపారు.
ఇది 4జీ టెక్నాలజీ ఫోన్. గూగుల్ జియో కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఆప్టిమైజ్డ్ ఆండ్రాయిడ్ ఓఎస్ ను దీంట్లో ఉపయోగించారు. రెగ్యులర్ ఆండ్రాయిడ్ అప్ డేట్లను ఇది స్వీకరిస్తుంది. రియాలిటీ ఫిల్టర్స్ కూడిన స్మార్ట్ కెమెరా ఈ ఫోన్ కు ప్రత్యేకం అని చెప్పాలి. వాయిస్ అసిస్టెంట్, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్, ఆటోమేటిక్ టెక్ట్స్ రీడ్ అలౌడ్ వంటి ఫీచర్లు ఇందులో ఇన్ బిల్ట్ గా లభిస్తాయి. అయితే రిలయన్స్ నేటి సమావేశంలో ఈ జియో ఫోన్ నెక్ట్స్ ధరను మాత్రం వెల్లడించలేదు.

Related posts

నేను ప్రజలు వదిలిన బాణాన్ని …షర్మిల

Drukpadam

ఐఐటీ ఉత్తీర్ణులకు ఆఫర్ల పంట..

Drukpadam

6 Helpful Tips For Growing Out Your Hair Without Losing Your Mind

Drukpadam

Leave a Comment