Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మావోయిస్టు హరిభూషణ్ వారసుడిగా దామోదర్.. అగ్రనాయకత్వం నిర్ణయం?

మావోయిస్టు హరిభూషణ్ వారసుడిగా దామోదర్.. అగ్రనాయకత్వం నిర్ణయం?
-ఇటీవల కరోనాతో మృతి చెందిన హరిభూషణ్
-ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్న దామోదర్
-సుదీర్ఘ అనుభం, పార్టీలో సీనియర్ కావడం కలిసొచ్చే అంశం

కరోనాతో మృతి చెందిన మావోయిస్టు నేత, తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ వారసుడిగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దామోదర్ ప్రస్తుతం రాష్ట్ర పార్టీ మిలిటరీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుండడంతోపాటు యాక్షన్ బృందాలకు ఇన్‌చార్జ్‌గానూ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్ర కమిటీ సభ్యుడిగానూ ఉన్న ఆయనకు ఉత్తర తెలంగాణ వ్యవహారాలపై గట్టి పట్టు ఉండడంతో పగ్గాలను ఆయనకే అప్పగించాలని పార్టీ అగ్రనాయకత్వం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి తోడు రాష్ట్ర పార్టీలో సీనియర్ కావడం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశాలని చెబుతున్నారు. అలాగే, గతంలో ఏటూరు నాగారం-భూపాలపల్లి ఏరియా, కరీంనగర్-ఖమ్మం-వరంగల్ కార్యదర్శిగానూ దామోదర్ పనిచేశారు.

కరోనా తో మావోయిస్టుల కార్యకలాపాలకు విఘాతం కలిగింది. అనేకమంది నేతలు కరోనా భారిన పడ్డారు . ఇందులో ముఖ్యనేతలు కూడా ఉన్నారు. కొంత మంది ముఖ్యనగరాలు , పట్టణాలకు చేరుకొని రహస్యంగా చికిత్స తీసుకున్నట్లు తెలుస్తుంది. అయినప్పటికీ కొందరు ముఖ్యనేతలు ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. వారి వివరాలు తెలియాల్సిఉంది.

హరిభూషణ్ కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

హరిభూషణ్‌ను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్న సీతక్క
మహబూబాబాద్ జిల్లాలోని హరిభూషణ్ ఇంటికి వెళ్లి పరామర్శ
సీతక్కను పట్టుకుని రోదించిన కుటుంబ సభ్యులు
హరిభూషణ్ ప్రజల మనిషి అని కొనియాడిన ఎమ్మెల్యే

మావోయిస్టు నేత హరిభూషణ్ మరణ వార్తతో ములుగు ఎమ్మెల్యే సీతక్క శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్న మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెంలోని హరిభూషణ్ ఇంటికి వెళ్లిన సీతక్క ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీతక్కను చూసిన ఆయన కుటుంబ సభ్యులు రోదించడంతో ఆమె కూడా కన్నీరుపెట్టుకున్నారు. వారిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హరిభూషణ్ మృతి బాధాకరమని అన్నారు. ఆయన ప్రజల మనిషి అని కొనియాడారు. పాకాల కొత్తగూడ ప్రాంతంలో హరిభూషణ్ టీం లీడర్‌గా ఉన్నప్పుడు తాను కూడా ఆ ప్రాంత ప్రజల హక్కుల కోసం పని చేశానని సీతక్క గుర్తు చేసుకున్నారు.

Related posts

హైదరాబాద్ యువతలో పెరిగిన హార్ట్ ఎటాక్ రిస్క్

Drukpadam

ప్రతీ ఇంటా ఈ రెండు యాప్‌లు ఉండాలి: సీఎం జగన్‌

Ram Narayana

దేశంలో తొలి హైడ్రోజన్ కారులో పార్లమెంటుకు విచ్చేసిన మంత్రి గడ్కరీ!

Drukpadam

Leave a Comment