Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

రాష్ట్రంలో పాదయాత్రకు కేటీఆర్ సన్నద్ధం …

డిసెంబర్ వరకు పార్టీ బలోపేతం… వచ్చే ఏడాది నుండి పాదయాత్ర చేస్తా: కేటీఆర్

  • ప్రస్తుతం జిల్లాల పర్యటనలలో ఉన్నానన్న కేటీఆర్
  • బీఆర్ఎస్ కార్యక్రమాలకు అద్భుత స్పందన వస్తోందన్న కేటీఆర్
  • ప్రజల కోసం బీఆర్ఎస్‌కు అధికారం ఖాయమన్న కేటీఆర్

వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను జిల్లాల పర్యటనలను ప్రారంభించానని, డిసెంబర్ వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఉంటానని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ కార్యక్రమాలకు అద్భుత స్పందన వస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనను అంతం చేయాలని, ప్రజల కోసం బీఆర్ఎస్‌కు అధికారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమాలు, పోరాటాలు, అధికారం, ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్‌కు కొత్తేమీ కాదని అన్నారు.

కాంగ్రెస్ అరాచక పాలనను అంతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఫినిక్స్ పక్షిలా పైకి ఎగురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

కేటీఆర్ దురహంకారి: మంత్రి సీతక్క ఆగ్రహం

Ram Narayana

తెలంగాణలో రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం

Ram Narayana

రేవంత్ రెడ్డి మీడియా సమావేశం… స్పందించిన కేటీఆర్..

Ram Narayana

Leave a Comment