Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

డీలిమిటేషన్ ప్రక్రియపై ప్రధాని మోదీకి జగన్ లేఖ!

  • డీలిమిటేషన్ ప్రక్రియ గురించి మోదీకి జగన్ లేఖ
  • జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలన్న జగన్
  • దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని విన్నపం

డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ కారణంగా పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుందని… అందుకే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలని కోరుతున్నామని లేఖలో జగన్ పేర్కొన్నారు. 

పార్లమెంట్ లో తీసుకునే నిర్ణయాల్లో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని జగన్ చెప్పారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని కోరారు. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా డీలిమిటేషన్ కసరత్తు జరగాలని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు.  

మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ఆదేశాల మేరకు ఈ లేఖ సారాంశాన్ని డీఎంకేకు వైవీ సుబ్బారెడ్డి పంపించారు.

Related posts

విజయవాడ మెట్రో రైలు కల సాకారానికి పడిన తొలి అడుగు!

Ram Narayana

తిరుమల నడకదారిలో మరోసారి క్రూరమృగాల కలకలం

Ram Narayana

డ్రోన్ గార్డ్ వ్యవస్థను ఓ దేశానికి ఇచ్చామన్న ఇజ్రాయెల్… పేరు చెప్పకున్నా ఇండియాకేనని అంచనా!

Drukpadam

Leave a Comment