Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

జమిలి ఎన్నికలపై ఏర్పాటైన జేపీసీ గడువు పొడిగింపు…

  • రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు జేపీసీ ఏర్పాటు
  • ఏప్రిల్ 4వ తేదీతో ముగియనున్న జేపీసీ కాలపరిమితి
  • గడువు పొడిగిస్తూ తీర్మానం ప్రతిపాదించిన బీజేపీ ఎంపీ పీపీ చౌదరి
  • వర్షాకాల సమావేశాల చివరి వారంలో తొలి రోజు వరకు గడువు

జమిలి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) కాలపరిమితిని పెంచేందుకు లోక్‌సభ అంగీకరించింది. జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

తాజాగా, బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ప్రతిపాదించిన గడువు పెంపు తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. రాబోయే వర్షాకాల సమావేశాల చివరి వారంలో తొలి రోజు వరకు గడువును పొడిగించింది.

39 మంది ఎంపీలతో ఏర్పాటు చేసిన జేపీసీ కమిటీ ఈ బిల్లును అధ్యయనం చేస్తోంది. ఇందులో లోక్‌సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉన్నారు. వాస్తవానికి ఈ కమిటీ కాలపరిమితి ఏప్రిల్ 4న ముగియనుంది. ఈ బిల్లుపై చేయాల్సిన పని ఇంకా మిగిలి ఉందని అధికార వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో జేపీసీ గడువు పొడిగించే తీర్మానానికి లోక్ సభ ఈరోజు ఆమోదం తెలిపింది.

Related posts

కేరళలో పెరుగుతున్న హెపటైటిస్ కేసులు.. ఇప్పటికే 12 మంది మృతి

Ram Narayana

వందో ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం.. నావిక్-2 ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధం!

Ram Narayana

క‌ర్ణాట‌క మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ క‌న్నుమూత‌

Ram Narayana

Leave a Comment