Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తిరుపతి ఉపఎన్నికలలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా ?

తిరుపతి ఉపఎన్నికలలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా ?
తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉపఎన్నికలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా? దాని ఆశలు నెరవేరుతాయా ? బీజేపీ ఏపీలో కాలుమోపడానికి చేస్తున్న కసరత్తు కు జనసేన సహకరిస్తోందా ? ప్రత్యేక హోదా పక్కన పెట్టిన బీజేపీని ఎపి ప్రజలు ఆదరిస్తారా? కులం,లేదా మతం కార్డుల ఆధారంగా లబ్ది పొందే ఆవకాశాలు ఉన్నాయా ? తిరుపతి లోకసభ పరిధిలో పెద్దగా ప్రభావం లేని బీజేపీ ఈ ఎన్నిక కోసం ఎందుకు ఆరాట పడుతున్నట్టు అనేది చర్చనీయాంశం అయింది . తిరుపతి ఉపఎన్నిక మార్చ్ చివరి నాటికీ  జరగాల్సి ఉంది. వైసీపీ కి చెందిన బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది . ఎపి లో 2019 ఎన్నికలలో అటు పార్లమెంట్ లో గాని , రాష్ట్ర శాసనసభ లో గాని ఖాతా తెరవని బీజేపీ ఉపఎన్నిక ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సొమ్ముచేసుకోవాలని చూస్తున్నది. అందుకు అనుకుంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది .తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు , మండలాలు , వారీగా ఉన్న పరిస్థితులను సేకరించేపనిలో పడ్డారు .పార్లమెంట్ పరిధిలో ఉన్న 47 మండలకు 47 మంది విస్తారకులను నియమించారు .వారు తమకు కేటావించిన మండలంలో 20 రోజులపాటు తిరిగి వివరాలు సేకరించారు . ఈ 47 మండలకు పార్టీ ముఖ్యనేతలను ఇంచార్జిలు గా నియమించారు .ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో సత్తాచాటాలని చూస్తున్నది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దీయోధర్ ఏపీలో మకాం వేసి తిరుపతి ఎన్నికపై దృష్టి సారించారు. జనసేన తో పొత్తు పెట్టుకొని ముందుకు పోతున్న బీజేపీకి జనసేన నుంచి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది.జనసేన కూడా తిరుపతి ఉపఎన్నికలలో పోటీచేయాలని గట్టిపట్టుదలతో ఉంది. బీజేపీ తమకు సపోర్ట్ చేస్తే తమ సత్తా చాటటం ద్వారా రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా వ్యహరించవచ్చు ననేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా ఉంది.
కీలకం కానున్న ప్రత్యేక హోదా
తిరుపతి ఉప ఎన్నికలలో ప్రత్యేక హోదా అంశం కీలకం కానున్నది . బీజేపీ ఎలాంటి ప్రచారం చేస్తుంది . దాని ప్రచార ఆయుధాలు ఏమిటి అనేది ఆశక్తిగా మారింది. ప్రత్యేక హోదా కావాలని ఆందోళనలు చేసిన పవన్ కళ్యాణ్ వైఖరి కూడా తెలపాల్సి ఉంటుంది . తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత ఎపి కి ఆదాయం తగ్గింది రాజధాని లేకుండానే రాష్ట్రాన్ని విడగొట్టారు. దీనిపై ఆంధ్రలో అసమ్మతిని చల్లార్చేందుకు బీజేపీ నేత వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు కావాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . 2014 పార్లమెంట్ ఎన్నికల్లో తిరుపతి కి వచ్చిన నరేంద్ర మోడీ అక్కడ జరిగిన సభలో వెంకన్న సాక్షిగా తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు . కానీ దాన్ని నెరవేర్చలేదు సరికదా ఇస్తామని కూడా చెప్పటంలేదు . పైగా ఫైనాన్స్ సంఘం అంగీకరించటంలేదని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ చెబుతుంది. దీనిపై రాష్ట్రంలో పెద్ద వెత్తున నిరసనలు వ్యక్తం వుతున్నాయి . ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. అందుకు అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయకత్వం లోని టీడీపీ ప్రభుత్వం మొదట అంగీకరించింది. తరువాత ప్రత్యేక హోదాకావాలని డిమాండ్ చేసింది . ఒక్క బీజేపీ మినహా రాష్ట్రంలో ఉన్న అధికార వైసీపీ తో సహా అన్ని పార్టీలు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలలో పోటీకి సిద్ధం అయింది . జనసేన ను ఒప్పించటం ద్వారా వారి మద్దతుతో ఎన్నికల బరిలో నిలవాలన్న బీజేపీకి ప్రచార అస్త్రం ఏమిటి అనేది చర్చనీయాంశంగా ఉంది. అయితే కమలనాధులు కేంద్రంలో అధికారంలో ఉండటంతో తమకు కలిసి వస్తుందని గట్టి నమ్మకంతో ఉంది. తిరుపతి లో వైసీపీ పై గెలవటం అంత తేలిక కాదనే విషయం తెలిసినప్పటికీ టీడీపీ కన్నా ఎక్కవ ఓట్లు పొందటం ద్వారా తామే రాష్ట్రంలో వైసీపీ కి ప్రత్యాన్మాయం అని చాటి చెప్పాలని చూస్తుంది . టీడీపీ అధికారంలో లేక పోయినప్పటికీ ఇప్పటికి ప్రజల్లో దానికి బలం ఉంది . టీడీపీ కన్నా బీజేపీ ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలిగితే తెలుగు దేశానికి ఇబ్బందులు తప్పవు . చూద్దాం ఏమి జరుగుతుందో .

 

 

Related posts

సంజయ్ రౌత్ పై ఈడీ చర్య… మౌనంగా ఉన్న ప్రధాని మోడీ …శరద్ పవార్

Drukpadam

బీజేపీ ,టీడీపీ ,జనసేన దోస్తీకి రంగం సిద్ధం !

Drukpadam

ప్రజా గాయకుడు గద్దర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి …కేసీఆర్ పై పోటీకి సై..!

Drukpadam

Leave a Comment