Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రగతి భవన్ తెలుపులు తెరుచుకోవడానికి కారణం -నాకు పదవి రావడమే :రేవంత్ రెడ్డి…

ప్రగతి భవన్ తెలుపులు తెరుచుకోవడానికి  కారణం -నాకు పదవి రావడమే :రేవంత్ రెడ్డి
-హైద్రాబాద్ కు తండ్రి కొడుకులు చేసింది ఏమిలేదు
-క్యాట్ వాక్ మంత్రి కేటీఆర్ ను ముసినదిలో ముంచాల్సిందే
-హై టెన్సషన్ విద్యుత్ లా పోరాడటమే పెంచిన కాంగ్రెస్ ఎంపీ
-కేసీఆర్, కేటీఆర్ లపై ధ్వజం
-కేటీఆర్ ను మూసీలో ముంచాలంటూ వ్యాఖ్యలు

తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియమితుడైన రేవంత్ రెడ్డి మాటల్లో పదును పెంచారు. కేసీఆర్, కేటీఆర్ లను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని నిఘా వర్గాలు నివేదిక ఇవ్వగానే, హడావుడిగా ప్రగతిభవన్ తలుపులు తెరిచారని వ్యాఖ్యానించారు. ఖబడ్దార్ కేసీఆర్…. నీ సంగతేంటో చూస్తా అని హెచ్చరించారు. ఇకపై సాధారణ కరెంటు తీగల్లా కాదు, హైటెన్షన్ వైరులా కొట్లాడతాం అని స్పష్టం చేశారు.

హైదరాబాదు నగరానికి తండ్రీకొడుకులు చేసింది ఏమీలేదని విమర్శించారు. మెట్రో సిటీని భ్రష్టు పట్టించారని అన్నారు. నగరంలో సమస్యలు ఎలాంటివో కేటీఆర్ కు తెలియాలంటే ఆయనను మూసీ నదిలో ముంచి ఓ నాలుగు గంటలు ఉంచాలని వ్యంగ్యం ప్రదర్శించారు. కేటీఆర్ పర్యటనలు అంతా ఫ్యాషన్ పరేడ్ ను తలపిస్తుంటాయని, క్యాట్ వాక్ తరహాలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఓ రాష్ట్రంలో నాలాలు నిండిపోయి చెత్త పేరుకుపోవడంతో, ఆ కాంట్రాక్టరును పిలిపించి అతడిపై చెత్త వేశారని, కేటీఆర్ కు కూడా అదేరీతిలో సత్కారం చేయాలని అన్నారు.

ఇక, తాను సోదరిగా భావించే సీతక్క గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీతక్క తనతో సరిసమానం అని వివరించారు. ఒకే కుర్చీ ఉంటే ఆ కుర్చీలో తాను సీతక్కనే కూర్చోబెడతానని ఆమె పట్ల తన గౌరవాన్ని చాటారు. సీతక్క తనకు అండ అని పేర్కొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో పర్యటన కోసం అధిష్టానం అనుమతి తీసుకుంటానని అన్నారు.కాంగ్రెస్ అంటే కేసీఆర్ కు తెలిసి వచ్చేలా కార్యాచరణ ఉంటుందని ,కాంగ్రెస్ పార్టీకు మంచి రోజులు వస్తున్నాయని అన్నారు….

Related posts

మ‌ధ్యాహ్నం 1.19 గంట‌ల‌కు బీఆర్ఎస్ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న చేసిన కేసీఆర్‌!

Drukpadam

నాపై అన‌ర్హ‌త వేటు వేయ‌లేరుగాక వేయలేరు…ఎంపీ రఘురామ…

Drukpadam

బీఎస్పీలో చేరనున్న మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్!

Drukpadam

Leave a Comment