Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కొత్త పీసీసీ సారధి రేవంత్ కు సీనియర్ల నుంచి చిక్కులే….

కొత్త పీసీసీ సారధి రేవంత్ కు సీనియర్ల నుంచి చిక్కులే….
-ఉత్తమ్ ,భట్టి లనుంచి రాని సానుకూలత
-వారిని కలిసేందుకు సైతం రేవంత్ కు దొరకని అపాయింట్ మెంట్
-శ్రీధర్ బాబు , జీవన్ రెడ్డి , జగ్గారెడ్డి , అదేబాట
-ఇప్పటికే కోమటి రెడ్డి వెంకట రెడ్డి ధిక్కార స్వరం
-బుజ్జగించే పనిలో అధిష్టానం
-ససేమీరా అంటున్న సీనియర్లు

హోరాహోరీ పోరులో టీపీసీసీ ఫీఠం దక్కించుకున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ లోని సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది . ఆయన ఈ నెల 7 న గాంధీభవన్ పదవి భాద్యతలు స్వీకరించేందుకు సిద్దపడుతున్నారు. అందుకు ముహర్తం కూడా పెట్టుకున్నారు .కానీ పదవి కోసం జరిగిన ఫైట్ కన్నా పార్టీలోని సీనియర్లను బుజ్జగించడం ఆయనకు తలకు మించిన భారంగా మారింది. ఇప్పటికే కొందరు ముఖ్యనేతలను రేవంత్ కలిసినప్పటికీ అవుట్ గోయింగ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గాని, ఇంకా రేవంత్ కు అందుబాటులోకి రాలేదు. ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించడంపై వారు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.సీనియర్లు ఒక్కరుగాను , ముగ్గురు నలుగురు కలిసి తమ అభిప్రాయాలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ కు ,సహా ఇంచార్జిలుగా ఉన్న వారితో స్పష్టంగా చెప్పినప్పటికీ తమ మాట ఏమాత్రం లెక్క చేయకుండా , తమ అభిప్రాయానికి విరుద్ధంగా టీపీసీసీ చీఫ్ ను నియమించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారు పేరు ప్రకటించే ముందు సీనియర్లను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే బాగుండేదని అంటున్నారు. తెలుగు దేశం నుంచి వచ్చిన రేవంత్ పై ఓటుకు నోటు కేసు కూడా ఉంది. చాల రాష్ట్రాలలో పార్టీకు మొదటి నుంచి ఉన్నవారి విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేసిన ఏఐసీసీ తెలంగాణ విషయంలో ఎందుకు ఇలా చేసిందో అర్థం కాకా సీనియర్లు సతమతం అవుతున్నారు.

ఉత్తమ్ , భట్టి దూరం …..

నిన్నటి వరకు సుదీర్ఘకాలం పాటు పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ,సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లు రేవంత్ పదవి విషయంలో పెదవి విప్పలేదు …. వారిని కలిసేందుకు నూతన పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు … దీనితో సీఎల్పీ లీడర్ గా కీలక బాధ్యతల్లో ఉన్న భట్టిని పార్టీ అధిష్టానం ఢిల్లీకి రావాలని కబురు పెట్టడంతో ఆయన రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. ఉత్తమ్ హైద్రాబాద్ లో ఉన్నప్పటికీ రేవంత్ ను కలిసేందుకు ఇష్టపడలేదని సమాచారం .

జీవన్ రెడ్డి ,శ్రీధర్ బాబు , జగ్గా రెడ్డి , పొదెం వీరయ్య , లది అదేబాట ….

మిగిలిన సీనియర్లలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి హెచ్ మాత్రం ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రిలో ఉండగా రేవంత్ స్వయంగా వెళ్లి కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. దీంతో ఆయన కొంత మెత్తబడ్డట్లు తెలుస్తుంది. అందరికనే మొదట రేవంత్ ను తీవరగా వ్యతిరేకించింది వి హెచ్ నే ఇక మిగిలిన వారిలో జీవన్ రెడ్డి , శ్రీధర్ బాబు , జగ్గారెడ్డి , పొదెం వీరయ్య , రేవంత్ ను కలిసేందుకు అంతగా ఇష్టపడటం లేదు. దూరం దూరంగా ఉంటున్నారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాగా , ఒకరు ఎమ్మెల్సీ , కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎల్పీ నాయకులతో కలిసి ఉంటున్న పార్టీ వ్యవహారాలపై అంతా సుముఖంగా లేరు .

ధిక్కార స్వరం వినిపించిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి …

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ని నియమించిన వెంటలే వ్యతిరేకంగా స్పందించిన నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి , అయిన తనకే టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు . కానీ అది తనకు దక్కకపోయేసరికి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పై డైరెక్ట్ అటాక్ చేశారు. డబ్బులు తీసుకోని పదవి అమ్ముకున్నారని ఆరోపణలు గుప్పించారు. గాంధీ భవన్ టీడీపీ కార్యాలయంగా మారిందని అందువల్ల తాను గాంధీ భవన్ మెట్లు వెక్కనని భీస్మా ప్రతిజ్ఞ చేశారు. కొత్త కార్యవర్గాన్ని హుహురాబాద్ లో డిపాజిట్ తెచ్చుకోమంది చూద్దాం అని అన్నారు. అధ్యక్షుడి తో సహా కొత్త కార్యవర్గ సభ్యులు ఎవరు తనను కలవద్దని తెలిపారు. దీనిపై అధిష్టానం సీరియస్ గా ఉంది … వెంటనే రంగంలోకి దిగిన అధిష్టానం కోమటి రెడ్డి విషయంలో ఏమి జరిగిందో తెలియదు కానీ ఆయన పార్టీ విషయాలు ఇకపై మాట్లాడానని తెలిపారు.

బుజ్జగించే పనిలో అధిష్టానం … ససేమీరా ఆంటున్న సీనియర్లు

రేవంత్ నియామకంతో సీనియర్ల నుంచి ఇంతటి ప్రతిఘటన ఊహించని పార్టీ అధిష్టానం పెద్ద నాయకులను బుజ్జగించే పనిలో పడింది . అందులో భాగంగా మొదట సీఎల్పీ నేత భట్టిని ఢిల్లీకి పిలిపించింది. ఆయన రెండు రోజులుగా ఢిల్లీల మకాం వేసి పార్టీ ఇంచార్జి లకు తనదైన శైలిలో క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. ఉత్తమ్ , శ్రీధర్ బాబు , జీవన్ రెడ్డి , జగ్గా రెడ్డ్డి లాంటి వారు ఇంకా పార్టీ నిర్మాణంపై అసంతృప్తి గానే ఉన్నారు. అందువల్ల వారు కూడా పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర అసంతృప్తి గానే ఉన్నారు. 7 వ తారీకు అంటే మరో రెండు మూడు రోజులే ఉంది . ఈలోపు పరిస్థిలు చక్కబడతాయా ? లేదా అనేది చూడాలి మరి !

Related posts

అప్పు చేశా, త‌ప్పు చేయ‌లేదు… ఎమ్మెల్యేపై ప‌రువు న‌ష్టం దావా: మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు!

Drukpadam

గాడ్సే జిందాబాద్ అంటూ ట్విట్లు చేయడంపై వరుణ్ గాంధీ ఫైర్ !

Drukpadam

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేకు షాక్.. కేసీఆర్ పర్యటనలో ఘోర అవమానం!

Drukpadam

Leave a Comment