Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ ప్రాజెక్టులు అక్రమం… ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం: సీఎం కేసీఆర్…

ఏపీ ప్రాజెక్టులు అక్రమం… ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం: సీఎం కేసీఆర్
నీటి అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
ఏపీ తీరుపై తీవ్ర అసంతృప్తి
ఎన్జీటీ స్టే ఇచ్చినా పనులు జరుపుతోందని ఆరోపణ
కేఆర్ఎంబీ భేటీ రద్దు చేయాలని వ్యాఖ్యలు

 

కృష్ణానదిపై రెండు తెలుగు రాష్ట్రాలమధ్య జరుగుతున్నా నీటి జగడం తీవ్ర స్థాయికి చేరుకుంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు , అంతుకుముందు కట్టిన పోతిరెడ్డిపాడు అక్రమమేనని తెలంగాణ సర్కార్ వాదిస్తుంది . దీనిపై ఏపీ సర్కార్ అబ్యతంతరాలు వ్యక్తం చేస్తుంది . తమకు కేటాయించిన నీళ్లను మాత్రమే తాము తీసుకుంటాము తప్ప ఒక చుక్క కూడా మేము తీసుకోమని చెబుతుంది. ప్రాజక్టు లెవల్ 847 అడుగుల పైన ఉన్నప్పుడు మాత్రమే ఏపీ సర్కార్ తీసుకోవాలని తెలంగాణ వాదనలు సమంజసం కాదని పోతిరెడ్డి పడు ద్వారా తాము నీళ్లను డ్రా చేయలేక పోతున్నందునే రాయలసీమ ప్రాజక్టు నిర్మాణం చేపట్టామని చెబుతుంది. అక్రమ ప్రాజెక్టు లు కట్టింది తెలంగాణనే అని పేర్కొంటుంది. ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన ప్రాజక్టుల విషయంలో చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో ఢిల్లీ టూర్ కు రెడీ అవుతున్న కేసీఆర్ , జగన్ ప్రభుత్వం కడుతున్న ప్రాజక్టు లు అక్రమమేనని అన్నారు. వాటిని ఎట్టి పరిస్థితిలో అంగీకరించబోమని స్పష్టం చేశారు.

నీటి కేటాయింపులు లేకుండానే, పర్యావరణ అనుమతులు రాకుండానే ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ తీరు అక్రమం అని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఎన్జీటీ స్టే ఇచ్చినా ఏపీ ప్రాజెక్టుల పనులు జరుగుతూనే వున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఒక చట్టవ్యతిరేక ప్రాజెక్టు అని, రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అక్రమ ప్రాజెక్టేనని ఆరోపించారు.

ఇక, జులై 9న నిర్వహించ తలపెట్టిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని రద్దు చేసి, జులై 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. అంతేగాకుండా, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న 66:34 నిష్పత్తిని తొలగించి, ఇకపై 50:50 నిష్పత్తిలో పంపకాలు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ అజెండాను సిద్ధం చేసి కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు పంపాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

Related posts

రాహుల్ ప్రధాని అవుతారు : ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు.

Drukpadam

ఆంధ్రా , తెలంగాణ రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం …

Drukpadam

దటీస్ కేసీఆర్ దేశమంతా ఇదే ఫార్ములా …అభ్యర్థికి బీఫామ్‌తో పాటు రూ.40 ల‌క్ష‌ల చెక్కు!

Drukpadam

Leave a Comment