Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

“దూకుడే నా లక్షణం” … “పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టుడే” : రేవంత్ రెడ్డి

దూకుడే తన లక్షణం … పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టుడే : రేవంత్ రెడ్డి
ప్రతిపక్షంలో గెలిచి సిగ్గులేకుండా అధికార పార్టీలోకి వెళుతున్నారు
ఫిరాయింపుదారులపై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్
దూకుడు తన లక్షణమని వెల్లడి
అది మారదని స్పష్టీకరణ
ఫిరాయిస్తే రాళ్లతో కొట్టిచంపుడేనని వ్యాఖ్యలు

పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ చీఫ్ , కాంగ్రెస్ నుంచి టీఆర్ యస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపుడే అని రేవంత్ రెడ్డి అంటే ఆయనపై ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , గండ్ర వేంకటరమణ రెడ్డి , సుధీర్ రెడ్డి లు … ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ , టీపీసీసీ పదవిని 25 కోట్లకు కొనుక్కొని వచ్చిన నీవా మాకు నీతులు చెప్పేది ..ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకో , మాటలు జాగ్రత్తగా రానివ్వు ,,, మావోయిస్టులు మాట్లాడే భాషామాట్లాడుతున్నావ్ ,,, తెలుగు దేశంలో గెలిచినా నువ్వు పార్టీ మారినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు …. మేము పద్దతి ప్రకారమే పార్టీ మారం … అనవసరం మాట్లాడితే కేసులు పెడతాం జాగ్రత్త అంటూ హెచ్చరించారు. దీనిపై రేవంత్ అదే స్థాయిలో వారికీ జవాబు ఇచ్చారు… తన దూకుడు కొనసాగుతుందని స్పష్టం చేశారు…..

కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఇతర పార్టీల్లోకి వెళుతున్న వారిని లక్ష్యంగా చేసుకుంటూ రేవంత్ రెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో గెలిచి సిగ్గులేకుండా అధికార పార్టీలోకి వెళుతున్నారని విమర్శించారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాక, ఇటీవల వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లేవారిని రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. దానిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తన మాటలతూటాలను మళ్లీ పేల్చారు.

తాను గతంలో ఇండిపెండెంట్ గా గెలిచి ప్రతిపక్షంలో చేరానని వెల్లడించారు. అంతకుముందు జడ్పీటీసీగానూ ఇండిపెండెంట్ గానే గెలిచానని తెలిపారు. అప్పుడు తాను కేసీఆర్ కు సహకారం అందించానని, తెలంగాణ సాధన కోసమే అప్పట్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చానని రేవంత్ రెడ్డి వివరించారు.

ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని, త్వరలోనే ఘర్ వాపసీ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. దూకుడు తన సహజ లక్షణం అని, అది మారదని అన్నారు. ఇక పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టిచంపుడేనని తన వైఖరి స్పష్టం చేశారు.

Related posts

పంజాబ్ ప్రభుత్వం బాగా పని చేసింది.. అక్కడ ఖలిస్థానీ ప్రభావం లేదు: అమిత్ షా…

Drukpadam

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన!

Drukpadam

కాంగ్రెస్ మాతో కలవాలంటే బెంగాల్‌లో ఇలా చేయాలి: మమత మెలిక

Drukpadam

Leave a Comment