జాతీయ వార్తలు

వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం..ఎంపీల మధ్య వాగ్యుద్ధం టీఎంసీ ఎంపీకి గాయాలు

  • ఢిల్లీలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ భేటీ
  • బీజేపీ ఎంపీ అభిజిత్, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం
  • గాజుతో తయారైన వాటర్ బాటిల్ విసిరిన కల్యాణ్ బెనర్జీ
  • ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీకి గాయాలు
  • ఆసుపత్రికి తీసుకెళ్లిన ఒవైసీ, సంజయ్ సింగ్

ఢిల్లీలో నేడు వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం నెలకొంది. దాంతో సహనం కోల్పోయిన ఎంపీ కల్యాణ్ బెనర్జీ టేబుల్ పై ఉన్న గాజుతో తయారైన వాటర్ బాటిల్ ను విసిరారు. 

ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ బొటనవేలు, చిటికెనవేలుకి గాయాలయ్యాయి. ఆయనను మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎంపీ కల్యాణ్ బెనర్జీకి వైద్యులు నాలుగు కుట్లు వేశారు. ఈ ఘటనతో జాయింట్ పార్లమెంటరీ సమావేశానికి కొద్దిసేపు అంతరాయం కలిగింది.

Related posts

ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద ఇకపై ‘నో క్యాష్’..

Ram Narayana

అరకు కాఫీకి జాతీయ ఖ్యాతి.. ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న జీసీసీ!

Ram Narayana

ఢిల్లీ పేరు మార్చండి: అమిత్ షా, రేఖా గుప్తాలకు బీజేపీ ఎంపీ లేఖ!

Ram Narayana