సుప్రీం కోర్ట్ వార్తలు

యువ లాయర్ల పట్ల సహనంతో ఉండండి.. జడ్జిలకు సుప్రీంకోర్టు హితవు…

  • యువ న్యాయవాదుల పట్ల సహనంతో ఉండాలని జడ్జిలకు సుప్రీంకోర్టు సూచన
  • ఏపీ హైకోర్టులో లాయర్‌ను కస్టడీకి పంపిస్తానన్న ఘటనపై స్పందన
  • వివాదం సామరస్యంగా పరిష్కారం కావడంతో కేసును మూసివేసిన ధర్మాసనం
  • వివాదాల పరిష్కారానికి గ్రీవెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని హైకోర్టులకు ఆదేశం
  • కోర్టు విచారణల వీడియోలపై మీడియా బాధ్యతతో ఉండాలని వ్యాఖ్య

న్యాయమూర్తులు ముఖ్యంగా యువ న్యాయవాదుల పట్ల సహనం, దయాభావంతో వ్యవహరించాలని, వారిని ప్రోత్సహించాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇటీవల ఓ యువ న్యాయవాదిని ఉద్దేశించి జడ్జి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, బార్ అసోసియేషన్ జోక్యంతో వివాదం సామరస్యంగా పరిష్కారమైనందున ఈ కేసును తాము మూసివేస్తున్నట్లు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

మే 4న ఏపీ హైకోర్టులో జస్టిస్ రాజశేఖర్‌రావు, ఓ యువ న్యాయవాది కోపంతో ఫైళ్లను పోడియంపై కొట్టారని భావించి, అతడిని పోలీసు కస్టడీకి పంపిస్తానని హెచ్చరించారు. అయితే, ఆ న్యాయవాది చేతిలోంచి ఫైలు జారిపోయిందని తెలిపారు. ఈ ఘటనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానాలు చేయడంతో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. హైకోర్టు న్యాయమూర్తి కేవలం మౌఖికంగా వ్యాఖ్యానించారని, ఎటువంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని ధర్మాసనం గుర్తుచేసింది.

ఈ సందర్భంగా, బెంచ్-బార్ (న్యాయమూర్తులు- న్యాయవాదులు) మధ్య వివాదాల పరిష్కారానికి అన్ని హైకోర్టులు, జిల్లా, తాలూకా స్థాయుల్లో గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే, కోర్టు విచారణలకు సంబంధించిన ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులను సందర్భం లేకుండా ప్రసారం చేయడంపై మీడియా బాధ్యతతో వ్యవహరించాలని, సమాజంలో మీడియా క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించింది.

Related posts

జగన్ అక్రమాస్తుల కేసు… ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Ram Narayana

తన రిటైర్మెంట్ తర్వాత విచారణ కావాలా?.. కేంద్రం తీరుపై సీజేఐ ఫైర్!

Ram Narayana

న్యాయం ఏడుస్తోంది: సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ!

Ram Narayana