జాతీయ రాజకీయ వార్తలు

క్షణక్షణం మారుతున్న తమిళ రాజకీయాలు…డీఎంకే ,ఏ ఐ డీఎంకే పొత్తు చర్చలు …?

తమిళనాడు ఎన్నికల్లో ఏపార్టీకి మెజార్టీ రాకపోవడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి .. క్షణమొక రకంగా మారుతున్నాయి.. ఎన్నికల్లో కలిసి పోటీచేసిన డీఎంకే ,కాంగ్రెస్ లు బంధం తెగిపోయింది .. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించడం పై డీఎంకే ఆగ్రహం ప్రకటించింది …ఇది అనైతికమని మిత్ర ధర్మాన్ని కాంగ్రెస్ గంగలో కలిపిందని విమర్శలు గుప్పించింది .ఇంతకీ తమిళనాట కొలువు దీరేది ఎవరు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది . ఇప్పటివరకు ఎన్నికల్లో ఎవరికీ సింగిల్ గా మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు పై ఉత్కంఠ నెలకొన్నది …అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీవీకే పార్టీ అవతరించింది .దాని అధినేత విజయన్ తమను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని గవర్నర్ ను కలిసి కోరారు ..తమకు 108 సీట్లు ఉన్నాయని , కాంగ్రెస్ మద్దతుతో మరో ఐదు సీట్లు కలిసి 113 అయ్యాయని మరో ఐదుగురు తమకు మద్దతు ప్రకటిస్తారని గవర్నర్ కు తెలిపారు …4 సీట్లు గెలుచుకున్న లెఫ్ట్ పార్టీలు తమ మద్దతు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ..అయితే సాయంత్రం స్టాలిన్ ను కలిసి సంఘీభావం ప్రకటించాయి .. టీవీకే పార్టీ అధినేత విజయ్ గవర్నర్ కలిశారు … దీంతో రేపు విజయ్ తమిళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అందరు భావించారు ..కానీ గవర్నర్ వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు…ఎవరిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించలేదు ..దీంతో రేపటి ప్రమాణస్వీకారం రద్దు అయింది … టీవీకే పార్టీ తమ సభ్యులను మహాబలిపురం రిసార్ట్ నుంచి రావద్దని ఆదేశాలు జారీచేసింది ..ముందు కొందరు ఏఐడీఎంకే సభ్యులు విజయ్ పార్టీకి మద్దతు ప్రకటిస్తారని వారిలో చీలిక ఏర్పడిందని షణ్ముగం నేతృత్వంలో 35 ఎమ్మెల్యేలు విజయ్ పార్టీలో చేరనున్నారని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి ..అయితే అలాంటిది ఏమి జరగక పోవడంతో టీవీకే పార్టీలో ఆందోళన నెలకొన్నది ..

ఎవరు ఊహించని విధంగా డీఎంకే , ఏ ఐ డీఎంకే లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని వార్తలు రావడంతో ఆశ్చర్య పడటం ప్రజల వంతు అయింది. అసలు ఈ ఆలోచనకు పురికొల్పిన అంశాలు వ్యక్తులు ఎవరు …తెరవెనక ఏమి జరుగుతుందనే విషయాలపై ఆసక్తి నెలకొన్నది …ప్రధానంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ,స్టాలిన్ కలిసి సంఘీభావం తెలపడం వెనక ఎదో పెద్ద మతలబే ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా …అయినా స్టాలిన్ ను కలిసిన తర్వాతనే రెండు బద్ద శత్రువులుగా ఉన్న డీఎంకే ,ఏఐడీఎంకే పార్టీలు కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నాయని వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ..రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని చెరో రెండున్నర సంవత్సరాలు అధికారాన్ని పంచుకోనున్నాయని ప్రచారం జరుగుతుంది ..అయితే రెండు పార్టీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు ..

అయితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చునని కొందరు రాజకీయ పండితులు పేర్కొంటున్నారు ..రాజకీయాలు ఏనాడో కలుషితమైయ్యాయని వాటిని గురించి ఎంత తక్కువ మాట్లాడు కుంటే అంత మంచిదని మరి కొందరు అంటున్నారు .
 

Related posts

వచ్చేది ‘ఇండియా’ ప్రభుత్వమే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన మమత

Ram Narayana

స్వల్ప మెజార్టీతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంపై విదేశీ మీడియా స్పందన…

Ram Narayana

ఇది తమిళనాడు… ఇక్కడ బీజేపీ ఎప్పటికీ గెలవదు: ముఖ్యమంత్రి స్టాలిన్

Ram Narayana