తుమ్మల రాజకీయ ప్రస్థానం సింహావలోకనం…
ఆయనది విలక్షణ వైఖరి
అభివృద్ధి ప్రధాతగా అపర భగీరధుడుగా కీర్తి
ఎన్టీఆర్ కాలువ ప్రారంభం …. మర్లకుంట విందు
నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తుమ్మల ప్రస్థానం అమోఘమైంది ..తనది విలక్షణ వ్యక్తిత్వం ..తన రాజకీయ జీవితంలో ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేయడం సామాన్యమైన విషయం కాదు …ఒక పార్టీ కూడా కాదు …మూడు పార్టీలు … మూడు పార్టీలు కూడా తుమ్మల అవసరాన్ని గుర్తించి రమ్మని అక్కున చేర్చుకొని పదవులు ఇచ్చాయి …అందుకే ఆయనొక రాజకీయ శిఖరం … ఆయన ప్రస్థానాన్ని సింహావలోకనం చేసుకోవాల్సిందే …ఆయనకు అపరభగీరధుడు…అభివృద్ధి ప్రధాతగా పేరుంది ..ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగాన్ని తన కనుసైగలతో పరుగులు పెట్టించిన ఘనుడు … తనకు ఇష్టం లేని పనులు ఎంతటివారు చెప్పిన “నో” చెప్పడం ఆయన స్టైలు .. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఉద్దండుడు …ఎవరికీ తలవంచని మనస్తత్వం ..మొదట కాంగ్రెస్ రాజకీయాలతో పరిచయం ఉన్నా… ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చింది తెలుగుదేశం పార్టీ, అందునా స్వర్గీయ ఎన్టీఆర్ …ఎక్కడో గండుగులపల్లి అనే కుగ్రామంలో పుట్టిన ఆయన ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశంలో చేరి అంచలంచలుగా ఎదిగి తన రాజకీయ జీవితంలో 4 గురు ముఖ్యమంత్రుల దగ్గర 20 సంవత్సరాలు మంత్రిగా చేసిన అపరచాణిక్యుడు … పదవుల కోసం ఏనాడూ ఆయన పాకులాడలేదు…ఆయనకు పదవులు వాటంతట అవే వచ్చాయి … 1986 మొదట ఎన్టీఆర్ మంత్రివర్గంలో చేరడానికి ఆయనపై వచ్చిన మూడు ఆరోపణలను ఆయన తరచూ చెపుతుంటారు ..అందులో ఒకటి డీఎస్పీ బదిలీ …రెండు ప్రభాకర్ రావు కు సంబందించిన భూ సమస్య , మూడు కారు కొనుగోలు … ఎన్టీఆర్ అర్జెంట్ గా హైద్రాబాద్ కు రమ్మంటే వెళ్లి కలిసినప్పుడు ఆయన అప్పటి సిబిఐ డైరెక్టర్ విజయరామారావు ఇచ్చిన కాగితం చేతిలో పెట్టారు… అదిచూసి మూడు అభియోగాలకు వివరణ ఇచ్చిన తర్వాత లేసి వెళ్ళుపోతుంటే ఎన్టీఆర్ అందేంది బ్రదర్ రండి ..మీరు మే 14 వ తేదీన మా మంత్రివర్గంలో చేరబోతున్నారని చెప్పారు .. 1986 మే 14 వతేదీన ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా చేరారు ..చిన్న నీటి పారుదల శాఖ ఇచ్చారు …నాటి నుంచి తన డైనమిజం…మాటకారి తనం, చేయాలనే తపనతో వచ్చిన ప్రతి అవకాశాన్ని కసిగా, పట్టుదలగా ప్రజల అభివృద్ధి కోసం వినియోగించారు …పైరవీలంటే చిరాకు …కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఎంతదూరమైనా వెళ్లేవారు ..జలగం వెంగళరావు తర్వాత జిల్లా అభివృద్ధికి నిరంతర తపన పడ్డ నాయకుడు …ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల చేసినన్ని అభివృద్ధి పనులు బహుశా వెంగళరావు కూడా చేయలేదంటే అతిశేయోక్తి కాదేమో … అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దిట్ట …భద్రాచలం వద్ద గోదావరి నదికి వరదలు వచ్చి అక్కడ ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతుంటే దానికి ప్రత్యాన్మాయంగా కరకట్ట నిర్మించి వరదలు రాకుండా నివారించిన ఘనత ఆయనదే …ఎవరు ఊహించని గోదావరి శబరి వద్ద బ్రిడ్జి నిర్మించిన ఎన్ని వరదలు వచ్చిన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేసిన మహనీయుడు ..అంతే కాదు ఛత్తీస్ ఘడ్ అప్పుడు ఏపీ సరిహద్దుగా ఉన్న లొట్టిపిట్టల గండి వద్ద పాత బర్మా టేకు బ్రిడ్జి స్థానే కొత్త బ్రిడ్జి నిర్మించి గిరిజనప్రజల మనసులు గెలుచుకున్నారు ..చర్ల వద్ద తాలిపేరు పై వారధిని నిర్మించి ఆ ప్రాంత ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారు ..తెలిపేరు ప్రాజెక్ట్ ,పెద్దవాగు ప్రాజెక్ట్ ఆధునికీకరణ , గోదావరిపై చెక్ డాం లు , భద్రాచలం వద్ద గోదావరిపై రెండవ బ్రిడ్జి , ఖమ్మం నగరం అవసరాలను దూరదృష్టితో ఆలోచించి మున్నేరు పై బ్రిడ్జి ప్రకాష్ నగర్ బ్రిడ్జి, ఖమ్మం కు నలువైపులా జాతీయ రహదార్లు , పాలేరు నియోజకవర్గంలో కరువు మండలాలకు సాగు తాగు నీరందించే భక్తరామదాసు ప్రాజెక్ట్ ఇలా చెప్పుకుంటూ పొతే లక్షల కోట్లతో జిల్లా రూపురేఖలను మార్చిన నాయకుడుగా తుమ్మల ఖమ్మం జిల్లా చరిత్ర పుటల్లో నిలిచారు ..
చతురోక్తుల ఘనాపాటి తుమ్మల ..

నిత్యం నవ్వుతు నవ్విస్తూ సందర్బోచితంగా చతురోక్తులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి… హాస్యాన్ని పండించడంలో దిట్ట … కొన్ని సందర్భాలలో ఏమిటి తుమ్మల ఇలా మాట్లాడుతున్నారని అనుకున్న అందులో నిగూఢ అర్ధం ఉంటుందనే విషయం ఆయన్ను దగ్గరగా చూసిన అతి కొద్దీ మందికే తెలుసు … పేపర్లలో వచ్చిన వార్తలపై కూడా వేసే సైటర్లు కడుపుబ్బా నవ్వించేవి … ఆయన తిట్టినా అవి వినసొంపుగా ఉండేవి …కొన్ని సందర్భాలలో ఇబ్బందులు తెచ్చిన పట్టించుకోలేదు .. తన ప్రసంగాలలో , సైటర్లు, కౌంటర్లు ప్రజలను ఆలోచింప జేసేవిగా ప్రత్యర్థులకు చురకలు అంటించేవిగా ఉండేవి ..తనకు ఇష్టం లేనిపనులను చెపితే విననట్లుగా ఉంటారు .. తాను చేయాలనీ అనుకుంటే ఎంతదూరమైనా పోతారు .. ఇది తుమ్మల స్టైల్ … వ్యక్తిగత పనులకు దూరంగా ఉంటారు …ఇది ఆయన మైనస్ ..తనకు దగ్గరా ఉండేవాళ్ళకు పట్టుబట్టి పదవులు ఇప్పించరనే ప్రచారం ఉంది ..
ఎన్టీఆర్ , చంద్రబాబు కేసీఆర్ , రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రుల వద్ద డజనుకు పైగా శాఖలను నిర్వహించారు …అన్నిటిని ముందు ఆకళింపు చేసుకొని ఆశాఖలపై పట్టు సాధించేవారు …మొదట చిన్ననీటి పారుదల తర్వాత భారీ నీటిపారుదల , రోడ్లు భవనాలు , ఎక్సయిజ్ వ్యవసాయ, కో- ఆపరేటివ్ మార్కెటింగ్ ఇలా అనేక శాఖలపై ఆయనకు పట్టు ఉంది ..ఇష్టంలేకుండా కష్టంగా చేసిన శాఖ ఎక్సయిజ్ శాఖ …ఆశాఖ ఉన్నతకాలం ఆయన అయిష్టంగా ఉన్నారు ..
మర్లకుంట విందు …

కరువు మండలంగా ఉన్న వేంసూరు కు నీరు అందించే బేతుపల్లి టు వేంసూరు ఎన్టీఆర్ కాలువ నిర్మించారు ..దాన్ని ప్రారంభానికి అరడజను మంది మంత్రులు, ఆనాడు లోకసభ స్పీకర్ గా ఉన్న జీఎంసీ బాలయోగి అతిధులుగా వచ్చారు ..అట్టహాసంగా కార్యక్రమం జరిగింది ..ఆతిధ్యం ఇవ్వడంలో పెద్ద మనసున్న తుమ్మల తన అనుయాయులచేత ఆ రాత్రి మర్లకుంట గ్రామంలో విందు ఏర్పాటు చేశారు ..ఆ విందులో జింక , నెమళ్లు, దుప్పిలాంటి అడవి జంతువుల మాంసం వడ్డించారని ఆరోపణలు రావడం, పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వార్తలు రావడంతో శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది ..తుమ్మలను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది …ఇది అధికార టీడీపీ పార్టీకి ఇబ్బందిగా మారింది…దీనిపై శాసనసభలో తుమ్మల ప్రసంగం అద్భుతంగా ఉంది …మర్లకుంట విందు తనకు తెలిసి జరిగింది కాదని తనను భాద్యుడిగా చేయదలిస్తే అభ్యంతరం లేదు ఇక్కడ నుంచి నేరుగా ఇంటికి వెళ్లి ముల్లు కర్రతో అరక దున్నకుంట అని చెప్పిన తీరు ఆకట్టుంది …మొత్తం సభ అంత నిశ్శబ్దవాతావరణం అలుముకుంది ..నిజంగానే తుమ్మల అన్నంత పనిచేస్తారు ..రైతుగా ముల్లు కర్ర పట్టుకొని వ్యవసాయం చేసుకుంటారని సభ్యులు గుసగుసలు సభ వాతావరణాన్ని రక్తి కట్టించాయి .. చివరకు నాడు సభలో సిపిఐ శాసనసభ పక్ష నేతగా ఉన్న పువ్వాడ నాగేశ్వరావు లాంటి వారు సభలో లేచి ఆ ప్రాంతంలో ఇది కామన్ అని చెప్పడం దాన్ని సభ్యులు లైట్ గా తీసుకోవడంతో దానికి ఫులిస్టాప్ పెట్టడంజరిగింది .
పార్టీలు మారడం ఆయన మనస్తత్వానికి విరుద్ధం …అయినా తప్పని పరిస్థితి

ఆయనకు పార్టీలు మారడం అంటే చిరాకు …ఆయన మనస్తత్వానికి విరుద్ధం …ఇష్టంగా చేరింది టీటీపీలోనే …ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు తో సుదీర్ఘ ప్రయాణం …రాష్ట్రం వీడిపోయిన తర్వాత తెలంగాణాలో టీడీపీ భవిష్యత్ ప్రశ్నర్ధకం …తన పాత స్నేహితుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ యస్ లో చేరిక …ఆయన మంత్రివర్గంలో రోడ్ల భవనాల శాఖ మంత్రిగా భాద్యతలు …బై ఎలక్షన్ లో పాలేరు లో ఎన్నిక …2018 లో తిరిగి పాలేరు నుంచి పోటీ సొంతపార్టీలో వెన్నుపోటు ఫలితంగా ఓటమి …2023 లో కాంగ్రెస్ ఆహ్వానం మేరకు అందులో చేరిక ఖమ్మం నుంచి పోటీ ఘన విజయం ..
ప్రస్తతం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాబినెట్ వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న తుమ్మల ఆరు సార్లు ఎమ్మెల్యే .. 20 సంవత్సరాలకు పైగా మంత్రి..ఇంకా కొనసాగుతున్నారు …ఇది ఒక రికార్డు ..బహుశా రెండు రాష్ట్రాల్లో ఇంతటి సీనియర్ మంత్రి మరొకరు లేరు … ఆయనకు మంత్రి పదవి లభించి 40 సవంత్సరాలు అయినా సందర్భంగా ఆయన హితులు, సన్నిహితులు , అభిమానులు ఖమ్మంలోని ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ కళాశాల మైదానంలో అభినందన సభ ఏర్పాటు చేయడం సంతోషం…