విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జీవితఖైదు
విమానాల పై బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని ‘నో ఫ్లై’ లిస్ట్లో చేర్చుతామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీచేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్‌కు పాల్పడేవారికి జీవితఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. చట్టంలో మార్పుల ప్రకారం కఠిన శిక్షలు, జరిమానా ఉంటుందని తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: