కులాలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

- సంఘాలు పెట్టుకుని నాయకులు బాగుపడ్డారు కానీ ఆయా కులాల ప్రజలు నష్టపోయారన్న పవన్
- గత వైసీపీ పాలనలో కుల దూషణలు, రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయని విమర్శలు
- డాక్టర్ సుధాకర్, దళిత యువకుడి హత్య వంటి ఘటనలను ప్రస్తావించిన జనసేనాని
- కులాల ఐక్యతే తమ సిద్ధాంతమని, దీనికి చరమగీతం పాడతామని స్పష్టీకరణ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోట బీజేపీ మాటలు
రాజకీయాల్లో వారు వీరు అవుతారు వీరు వారవుతారు అని నానుడి ఉంది . అందుకు తగ్గట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు . రాజకీయాల్లో ఏదో చేయాలని వచ్చిన ఆయన మరేదో చేస్తున్నారనే అభిప్రాయాలు . రాజకీయాలు చేయడం ఆయన ఇష్టం . దీనిలో పెద్దగా తప్పు పట్టాల్సిన పనిలేదు . కానీ నేను చెబుతున్న సూక్తులు ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి . పవన్ కళ్యాణ్ ది ఒక విచిత్రమైన క్యారెక్టర్ సినీ యాక్టర్ కం రాజకీయ నాయకుడిగా అవతరించిన పవన్ కళ్యాణ్ మొదట తాను అభ్యుదయ వాదినని తనకు చేగువేరా ఆదర్శమని ప్రకటించుకున్నారు . కమ్యూనిస్టులకు దగ్గరయ్యారు వారితో స్నేహం చేశారు . కులమతాలు లేవంటూనే తనకు కాపు కులస్తులంతా అండగా ఉండాలని కోరుకున్నారు . అందుకే ఒక మహానుభావుడు అన్నట్లు “ఏ పదజాలం వెనక ఈ వర్గ ప్రయోజనం దాగి ఉన్నదో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసగించబడుతూనే ఉంటారు” . ఇది అక్షర సత్యం . పవన్ కళ్యాణ్ మాటలకూ ఇది 100% వర్తిస్తుంది .. జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం . తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరుపుకునే రోజు . ఆరోజునే తెలంగాణలో మీటింగ్ పెట్టాలని జనసేన నేత పవన్ కళ్యాణ్ సంకల్పించారు . అందుకు ప్రభుత్వం నిరాకరించింది . ఇది సమయం కాదని తేల్చి చెప్పింది . అయితే ఆయన సభ జరుపుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు కానీ అలా చేయకుండా, హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టారు . ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పైన, తెలంగాణ ప్రజల పైన విషం చిమ్మారు .. తెలంగాణ మీ అయ్యా జారీరా అన్నారు… తెలంగాణాలో జనసేన పార్టీ పోటీచేస్తుందని ఎవరు అడ్డం వస్తారో రావాలని ఊగిపోయారు .. అసలు ఆయన ఊగిపోవాల్సినంత నష్టం హైద్రాబాద్ కు గాని తెలంగాణ ప్రజానీకానికి జరిగిందా అంటే లేదు… ఆయన ఎదో హిడెన్ ఎజెండాతో వచ్చారని ఎవరి పలుకులో పలుకుతున్నారని ఆ ప్రెస్ మీట్ చూసిన ఎవరికైనా కలుగుతుంది ..తిరిగి బుధవారం రోజున ఏపీలో ప్రెస్ మీట్ పెట్టారు…
రాష్ట్రంలో కుల సంఘాలు ఏర్పాటు చేసుకుని వాటి నాయకులు బాగుపడ్డారేమో కానీ, ఆయా కులాల ప్రజలు మాత్రం అభివృద్ధికి నోచుకోకుండా తీవ్రంగా నష్టపోతున్నారని జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సంచలన చేశారు. కులాల పేరుతో జరుగుతున్న రాజకీయాలకు చరమగీతం పాడాలని, కులాల ఐక్యతే తమ పార్టీ మూల సిద్ధాంతమని స్పష్టం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పవన్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం ఒక కులానికే పరిమితం చేసే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుల రాజకీయాలు, కుల దూషణలు పరాకాష్టకు చేరాయని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. 1998 నుంచి మొదలైన ఈ ధోరణి, వైసీపీ పాలనలో జర్నలిస్టులను సైతం కులం పేరుతో దూషించే స్థాయికి దిగజారిందని విమర్శించారు. ఒక ఎమ్మెల్సీ, దళిత యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేస్తే, అధికార పార్టీ నేతలు హంతకుడిని వెనకేసుకొచ్చారని, అప్పుడు దళిత సంఘాలు సైతం మాట్లాడలేని పరిస్థితిని సృష్టించారని మండిపడ్డారు. అలాగే కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్‌ను మానసికంగా హింసించి, ఆయన మరణానికి కారణమైనా ఏ సంఘాలు నోరు మెదపలేదని అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కుల సంఘాలు మౌనంగా ఉండిపోవడం వల్లే నాయకులు బాగుపడుతున్నారని, ప్రజలు మాత్రం నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు.
కుల నిర్మూలన అనే అంబేద్కర్ ఆశయం సాధ్యమో కాదో తెలియదు కానీ, కులాల మధ్య ఐక్యత, పరస్పర సహకారం నేటి సమాజానికి అత్యవసరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే, వాటిని పక్కనపెట్టి కేవలం కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.
ఈ కుల రాజకీయాలకు ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలని తమ పార్టీ నిర్ణయించుకుందని పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన తరఫున గెలిచిన 54 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వేర్వేరు కులాలకు చెందినవారేనని, అందరి సహకారంతోనే గెలుపు సాధ్యమైందని గుర్తు చేశారు. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో కులాల ఐక్యతను ప్రోత్సహిస్తూ, అభివృద్ధి ఆధారిత రాజకీయాలకు శ్రీకారం చుడతామని జనసేన నాయకత్వం సమిష్టిగా నిర్ణయం తీసుకున్నట్లు పవన్ ఈ సందర్భంగా ప్రకటించింది.