Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తనయుడితో కలిసి జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను క‌లిసిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్!

తనయుడితో కలిసి చిరంజీవి  జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను క‌లిసిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్!
పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్భంగా భేటీ
మర్యాదపూర్వకంగా కలిశాన‌న్న పువ్వాడ‌
అనంత‌రం కేటీఆర్ వ‌ద్ద‌కు పువ్వాడ‌

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవల కాలంలో ఏది చేసిన సంచలనంగా మారుతుంది. గతంలో శ్రీకారం అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా మరియు ఆచార్య సినిమా షూటింగ్ ఇల్లందు లో జరుగుతున్న సందర్భంగా ఖమ్మం వచ్చిన చిరంజీవికి ఆయన తనయుడు రాంచరణ్ కు తన నివాసంలో మంత్రి అజయ్ ఆతిధ్యం ఇచ్చారు. ఆ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. అజయ్ ఇటీవల కాలంలో చిరంజీవితోపాటు అనేకమంది సినీప్రముఖులు డైరక్టర్ కొరటాల శివతో సన్నిహితంగా ఉంటున్నారు.

ప్రత్యేకించి తనకుమారుడు నయన్ రాజ్ బర్తడే పురస్కరించుకొని సినీప్రముఖులు కలవడం వారితో స్నేహపూరితంగా మెలగడంతో మంత్రి తనకుమారుడిని సినీ రంగంలోకి దించుతారా అనే సందేహాలు కలుగుతున్నాయి. లేదా సినీ నిర్మాతగా మారనున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై మంత్రి అజయ్ వైఖరి ఏమిటి ? కుమారుడి అభీష్టం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది . మంత్రి మాత్రం తమది మర్యాదపూర్వకంగా భేటినే అంటున్నారు.

‘నా తనయుడు డాక్ట‌ర్ పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ని మర్యాదపూర్వకంగా కలవడమైంది’ అంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా తార‌క్ తో తీసుకున్న ఫొటోల‌ను ఆయ‌న పోస్ట్ చేశారు.

ఆ స‌మ‌యంలో అక్క‌డ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా ఉన్నారు. అయితే, ఉన్న‌ట్టుండి పువ్వాడ జూనియ‌ర్ ఎన్టీఆర్ ను క‌ల‌వ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. పువ్వాడ నయన్ ను సినిమాల్లోకి తీసుకొస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ కి న‌య‌న్ అభిమాని అయి ఉండొచ్చ‌ని మరి కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

మ‌రోవైపు, కేటీఆర్‌ను కూడా పువ్వాడ అజ‌య్ కుమార్, నయ‌న్ కలిశారు. ‘నేడు నా తనయుడు డాక్ట‌ర్ పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా రామన్న కుటుంబాన్ని మర్యాపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడమైంది’ అని పువ్వాడ అజ‌య్ కుమార్ ట్వీట్ చేశారు.

చిరంజీవి  శుభాకాంక్షలు

పువ్వాడ అజయ్ కుమార్  తనయుడు నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవిని కలిసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తనయుడు పువ్వాడ నయన్ రాజ్. అనంతరం నయన్ తో కేకే కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..

Related posts

సామాన్య గిరిజన మహిళకు అత్యన్నత రాష్ట్రపతి కిరీటం!

Drukpadam

ఖమ్మంలో హైద్రాబాద్ స్థాయి కార్పొరేట్ చికిత్స…మంత్రి హరీష్ రావు …

Drukpadam

కంటి చూపును కాపాడే ఆహారాలు ఇవి..!

Drukpadam

Leave a Comment