Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈ సాయంత్రం ఉత్తమ్, భట్టివిక్రమార్కలతో  రేవంత్ భేటీ!

ఈ సాయంత్రం ఉత్తమ్, భట్టివిక్రమార్కలతో  రేవంత్ భేటీ!
కాంగ్రెస్ నేత‌ భ‌ట్టి విక్ర‌మార్క‌తో మ‌ల్లు ర‌వి భేటీ
రేవంత్ రెడ్డిని క‌లిసేందుకు విముఖంగా ఉన్న భ‌ట్టి
భ‌ట్టిని ఢిల్లీకి పిలిపించి చ‌ర్చించిన కాంగ్రెస్ అధిష్ఠానం
ఢిల్లీ నుంచి వ‌చ్చిన భ‌ట్టి విక్ర‌మార్క‌తో మ‌ల్లు ర‌వి భేటీ
నేడు హైదరాబాదుకు రేవంత్..
విమానాశ్రయం నుంచి నేరుగా రామోజీరావు వద్దకు పయనం!
రేపు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ప్రమాణస్వీకారం
బెంగళూరులో డీకే శివకుమార్ తో భేటీ అయిన రేవంత్

కాంగ్రెస్ సీనియర్ల నూతన పీసీసీ అధ్యక్షుడుగా నియమించబడిన రేవంత్ రెడ్డిని కలిసేందుకు అయిష్టత చూపిన నేపథ్యంలో రేవంత్ రాయబారం ఫలించినట్లు తెలుస్తుంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం రేవంత్ ను కలిసేందుకు సుముఖంగా లేరు అయితే భట్టిని ఆయన సోదరుడు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కలిశారు . ఇద్దరి మధ్య చర్చలు జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు భట్టి ,ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తబడినట్లు తెలుస్తుంది. ఈ విరువూరు కీలక నేతలను రేవంత్ ఈ సయితం కలిసారని సమాచారం .

పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఐదు వేల బైక్ లతో ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కార్యాచరణ రూపొందించాయి. ప్రతి డివిజన్ నుంచి కనీసం 500 బైకులు పాల్గొనాలని నిర్ణయించారు. మరోవైపు వరుసగా కీలక నేతలను కలుస్తూ రేవంత్ బిజీగా ఉన్నారు.

బెంగళూరుకు వెళ్లిన ఆయన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో పాటు పలువురు నేతలను కలిశారు. ఈరోజు ఆయన బెంగళూరు నుంచి హైదరాబాదుకు చేరుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రేవంత్ రెడ్డి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ఆయన మర్యాదపూర్వకంగా కలవనున్నారు.

ఈ సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కలతో రేవంత్ భేటీ కానున్నారు. వాస్తవానికి రేవంత్ ను కలవడానికి వీరిద్దరూ ఆసక్తి చూపలేదని సమాచారం. అయితే మల్లు రవి వీరితో చర్చలు జరిపి ఒప్పించినట్టు తెలుస్తోంది. మల్లు రవి మంత్రాంగంతో వారు కాస్త దిగొచ్చినట్టు చెప్పుకుంటున్నారు.

టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేపు రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు కీల‌క నేత‌లు రానున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న వేళ కాంగ్రెస్ నేత‌ భ‌ట్టి విక్ర‌మార్క‌తో పీసీసీ సీనియ‌ర్ ఉపాధ్య‌క్షుడు మ‌ల్లు ర‌వి ఈ రోజు స‌మావేశం అయ్యారు.

రేవంత్ రెడ్డిని క‌లిసేందుకు భ‌ట్టి విక్ర‌మార్క విముఖ‌త చూపుతున్నారు. దీంతో భ‌ట్టిని ఢిల్లీకి పిలిపించి అధిష్ఠానం చ‌ర్చ‌లు జ‌రిపింది. ఢిల్లీ నుంచి వ‌చ్చిన భ‌ట్టి విక్ర‌మార్క‌తో మ‌ల్లు ర‌వి భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇప్ప‌టికే ప‌లువురు రాష్ట్ర‌ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల‌ను రేవంత్ రెడ్డి క‌లిసి వారి మ‌ద్ద‌తును కూడ‌గట్ట‌గ‌లిగారు. రేవంత్‌కి మొద‌టి నుంచి మ‌ల్లు ర‌వి సంపూర్ణ మ‌ద్ద‌తును తెలుపుతున్నారు.

Related posts

ఎన్నిక‌ల‌కు సిద్ధం.. స‌త్తా చాటుతాం: బండి సంజ‌య్!

Drukpadam

విజ‌య‌శాంతి, స్వామిగౌడ్‌తో క‌లిసి దీక్ష‌కు దిగిన బండి సంజ‌య్‌!

Drukpadam

ఎమ్మెల్యే వంశీపై సీనియర్ నేత దుట్టా ఫైర్!

Drukpadam

Leave a Comment