Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కంభంపాటి హరిబాబును గవర్నర్ గా నియమించిన కేంద్రం!

కంభంపాటి హరిబాబును గవర్నర్ గా నియమించిన కేంద్రం
మిజోరాం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు
హర్యానాకు బదిలీ అయిన బండారు దత్తాత్రేయ
పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీ

కేంద్రం గవర్నర్ల నియామకంలో మరోసారి కాషాయం ముద్రవేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో ప్రత్యేకించి బీజేపీ వేతర రాష్ట్రాలకు బీజేపీ లో సీనియర్లుగా ఉండి వయసు పైబడిన వారిని కేంద్రం గవర్నర్లుగా నియమించటం జరుగుతున్నా విషయం తెలిసిందే . అందులో భాగంగానే బీజేపీ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడుగా పనిచేసిన కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి ఇస్తూ ఆయనను మిజోరాం గవర్నర్గా నియమించింది . అదే విధంగా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం కొంతమందిని బదిలీ కూడా చేసింది. ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేసింది.

ఏపీ బీజేపీ నేత, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును పార్టీ అధిష్ఠానం సముచిత స్థానంతో గౌరవించింది. పార్టీ కోసం ఆయన చేసిన సేవలకు గాను గవర్నర్ పదవిని కట్టబెట్టింది. ఈరోజు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది. కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేసింది. మధ్యప్రదేశ్ గవర్నర్ గా మంగూభాయ్ ఛగన్ భాయ్ పటేల్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్రన్ విశ్వనాథ్ పర్లేకర్, గోవా గవర్నర్ గా పీఎస్ శ్రీధరన్ పిళ్లై, త్రిపుర గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ఝార్ఖండ్ గవర్నర్ గా రమేశ్ భయాట్, కర్ణాటక గవర్నర్ గా థావర్ చంద్ గెహ్లాట్ లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు అన్ని పార్టీల నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts

అమెరికాకు వెళ్లిపోయిన వైఎస్ విజయమ్మ?

Ram Narayana

తెలుగులో రాగులు…. ఇంగ్లీషులో ఫింగర్ మిల్లెట్స్… లాభాలేంటో చూద్దాం!

Drukpadam

ఈఎస్ఐ స్కాంలో రూ.144 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ!

Drukpadam

Leave a Comment