Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హరీశ్ రావుకు కూడా నాకు పట్టిన గతే పడుతుంది: ఈటల

  • త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక
  • హరీశ్ రావు విందులు ఏర్పాటు చేస్తున్నాడన్న ఈటల
  • హుజూరాబాద్ ప్రజలకు డబ్బులు ఇస్తున్నాడని ఆరోపణ
  • ప్రలోభాలకు పాతరేసే సత్తా ప్రజలకుందని వ్యాఖ్య

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు హరీశ్ రావు విందులు ఏర్పాటు చేస్తున్నాడని, డబ్బులు ఇస్తున్నాడని ఆరోపించారు. పార్టీ పెద్దల మెప్పు పొందాలని చూస్తున్నాడని విమర్శించారు. త్వరలో హరీశ్ రావుకు కూడా తనకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. హుజూరాబాద్ లో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

“మీ పార్టీ నుంచి గెలిచానని అన్నారుగా… అందుకే రాజీనామా చేశా. డబ్బు, ఇతర ప్రలోభాలను పాతరేసే సత్తా హుజూరాబాద్ ప్రజలకు ఉంది” అని స్పష్టం చేశారు. తమతో తిరిగే యువకులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ బెదిరించి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సీఎస్, డీజీపీ చట్టానికి లోబడి పనిచేయాలని, కొందరికి చుట్టంగా కాదని హితవు పలికారు.

Related posts

విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్‌ పాలకవర్గం ఏర్పాటు చేయాలి

Drukpadam

జర్నలిస్టుల కష్టాలు తెలుసు అందుకే ప్రత్యేక యాప్ :సి జె ఐ ఎన్ వి రమణ…

Drukpadam

సర్వదర్శన టోకెన్లకు ఎగబడిన భక్తజనం.. తోపులాట జరిగి పలువురికి గాయాలు

Drukpadam

Leave a Comment