Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పశుపతి పరాస్‌కు కేంద్రమంత్రివర్గంలో చోటిస్తే కోర్టుకెళ్తా: చిరాగ్ పాశ్వాన్

పశుపతి పరాస్‌కు కేంద్రమంత్రివర్గంలో చోటిస్తే కోర్టుకెళ్తా: చిరాగ్ పాశ్వాన్
చీలిక వర్గంలోని నేతలను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవద్దు
పరాస్‌ను కేంద్రమంత్రిని చేయాలంటే స్వతంత్రంగా తీసుకోండి
ఎల్‌జేపీ కోటా కింద తీసుకుంటే తప్పకుండా వ్యతిరేకిస్తాం

కేంద్ర మంత్రి వర్గంలోకి పరాస్ ను ఎల్జేపీ కోట కింద ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చిరాగ్ పాశ్వాన్ .ఆయన ఎల్జేపీ లో లేరని తమ పార్టీ చిలకకు కారణమైన పరాస్ ను ఎలా మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రధాని నరేంద్రమోడీ ని ప్రశ్నిస్తున్నారు. కావాలంటే పరాస్ ను వ్యక్తి గత హోదాలో మంత్రిగా చేయండి అభ్యంతరం లేదు … అని స్పష్టం చేశారు .

లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)లో చీలికకు కారణమైన నేత పశుపతి పరాస్‌ను కేంద్రమంత్రిని చేస్తే కనుక తాము కోర్టుకు వెళ్తామని ఎల్‌జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ హెచ్చరించారు. పరాస్ ప్రస్తుతం ఎల్‌జేపీలో లేరని, కాబట్టి పార్టీ కోటా కింద ఆయన మంత్రి కాలేరని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయనకు కనుక కేంద్ర కేబినెట్‌లో చోటివ్వాలనుకుంటే తమ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా తీసుకోవచ్చని సూచించారు. ఎల్‌జేపీ కింద మంత్రిని చేస్తే మాత్రం తాము వ్యతిరేకిస్తామని, తప్పకుండా కోర్టుకు వెళ్తామని చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు.

ఎల్‌జేపీని స్థాపించిన రాం విలాశ్ పాశ్వాన్ తమ్ముడే పశుపతి పరాస్. రాం విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను పశుపతి పరాస్ అన్ని పదవుల నుంచి తప్పించారు. పార్టీలోని రెబల్ గ్రూపునకు సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో ఆయనకు స్థానం దక్కే అవకాశం ఉందన్న వార్తలపై స్పందించిన చిరాగ్ పాశ్వాన్.. పార్టీ చీలిక వర్గంలోని ఏ ఒక్కరినీ కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవద్దని ప్రధానిని కోరారు. తీసుకుంటే కనుక కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

Related posts

పార్టీ ప‌ద‌వుల‌పై నారా లోకేశ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

Drukpadam

పీఎం కేర్స్ నిధులపై ఎన్డీటీవీ కథనం …రాహుల్ గాంధీ స్పందన !

Drukpadam

టీడీపీ నేత‌ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు అరెస్ట్…

Drukpadam

Leave a Comment