Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీపీసీసీ చీఫ్​ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్​…

టీపీసీసీ చీఫ్​ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్​
-భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
-ఉత్తమ్, భట్టి, సీనియర్ నేతల హాజరు
-కనిపించని కోమటిరెడ్డి బ్రదర్స్
-సందడిగా మారిన గాంధీభవన్
-పూజ‌ల్లో పాల్గొంటోన్న కాంగ్రెస్ నేత‌లు
-గాంధీ భ‌వ‌న్ లో పెద్ద ఎత్తున ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో నేతలు, రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. ముందుగా అనుకున్న ముహూర్తానికి అనుగుణంగా ఇవ్వాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన టీపీసీసీ పగ్గాలను అందుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.

అసంతృప్తులు అనుకున్న నేతలూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి తదితర సీనియర్ నేతలు రేవంత్ బాధ్యతల స్వీకారానికి హాజరయ్యారు.పీసీసీ పదవి ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోపాటు ఆయన సోదరుడు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు .

ఇప్పటికే గాంధీభవన్ లో రేవంత్ కు అనుగుణంగా వాస్తు మార్పులను చేశారు. సీఎల్పీ నేత భట్టి చాంబర్, ఇంతకుముందు పీసీసీ చీఫ్ చాంబర్ కు పక్కనే ఉన్న మీటింగ్ హాల్ ను కలిపి రేవంత్ చాంబర్ గా మార్చారు. ఇంతకు ముందు ఉత్తమ్ మూసేయించిన గేట్ నూ తెరిచి రెండు గేట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

కాగా, రేవంత్ పదవీ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద కోలాహలం నెలకొంది. మరికొద్ది సేపట్లో నిర్వహించనున్న బహిరంగ సభలో రేవంత్ మాట్లాడనున్నారు.

పెద్దమ్మ గుడిలో రేవంత్ పూజలు

టీపీసీసీ అధ్య‌క్షుడిగా తాను బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న నేప‌థ్యంలో ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో రేవంత్ పూజలు చేసి, అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి నాంపల్లిలోని యూసుఫైన్ దర్గా చేరుకున్నారు. అక్కడ చాదర్ సమర్పించి ప్రార్థనలు చేస్తున్నారు. ఆయ‌న వెంట భారీగా నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఉన్నారు.

కాసేప‌ట్లో అక్కడి నుంచి ప్రదర్శనగా గాంధీభవన్‌కు చేరుకుని, పీసీసీ అధ్యక్షుడిగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు తీసుకుంటారు. అదే స‌మ‌యంలో పీసీసీ కొత్త కార్యనిర్వాహక అధ్యక్షులు, ఇతర కమిటీ సభ్యులూ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆయా నేత‌లు కూడా ప‌లు ఆల‌యాల్లో పూజ‌లు చేస్తున్నారు.

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేయ‌నున్నారు. అనంత‌రం అసెంబ్లీలోని బంగారు మైసమ్మను దర్శించుకోనున్నారు. ప‌లు ప్రాంతాల నుంచి వస్తున్న కాంగ్రెస్ నేత‌లు అంద‌రూ కాసేప‌ట్లో గాంధీభవన్ కు చేరుకున్నారు .నేతలు కార్యకర్తలతో గాంధీ భవన్ కోలాహలంగా మారింది. గాంధీ భావంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ప్లెక్సీలతో నిండిపోయింది. సోనియా ,రాహుల్ ,ప్లెక్సీలు భారీగా దర్శనమిచ్చాయి.

 

 

Related posts

ఘనంగా ప్రారంభమైన సిపిఎం ఖమ్మం జిల్లా 21 వ మహాసభలు…

Drukpadam

!మోడీ ,కేసీఆర్ బంధం పై రేవంత్ రెడ్డి ఆశక్తికర మాటలు …

Drukpadam

పవన్ ఏపీ పర్యటన ఉద్రిక్తం … గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ఫ్యాన్స్ అడ్డుకున్న పోలీసులు

Drukpadam

Leave a Comment