Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కొత్త కేంద్ర మంత్రులకు ప్రధాని హితోపదేశం!

కొత్త కేంద్ర మంత్రులకు ప్రధాని హితోపదేశం!
తనకు హితులు సన్నిహితులు ఎవరు లేరని వ్యాఖ్య
పనితీరే కొలమానం అన్న ప్రధాని
కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డికి ప్రమోషన్
కేంద్ర మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్రపతి..
రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం
హాజరైన వెంకయ్యనాయుడు, మోదీ, అమిత్ షా
మంత్రి వర్గవిస్తరణ కాదు ప్రక్షాళనే
-12 మంది మంత్రులకు ఉద్వాసన
మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం
ఇందులో కొత్తవారు 36 మంది 7 గురికి ప్రమోషన్

ప్రధాని మోడీ కేంద్ర కేంద్ర మంత్రులతో ఇష్టాగోష్టి నిర్వహించారు…. అనేక మంది కొత్తవారికి కేంద్రమంత్రులుగా అవకాశం కల్పించారు … మంత్రి వర్గ విస్తరణ కంటే ప్రక్షాళన చేశారు ప్రధాని మోడీ … ఈ సందర్భంగా మోడీ మంత్రులకు హితోపదేశం చేశారు.మంత్రులు ఎవరు శాశ్వితం కాదని మల్లి విస్తరణ ఉండవచ్చునని సంకేతాలు ఇచ్చారు. అంటే దాదాపు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయమని సుతిమెత్తని హెచ్చరికలు చేశారు.
. ఇప్పుడు ఉన్న మంత్రిలు కొత్తగా మంత్రిపదవులు స్వీకరించేవారు శాశ్వితం కాదని కూడా ప్రధాని అన్నారు . తనకు ఎవరు హితులు ,సన్నిహితులు లేరని పనితీరే ప్రామాణికమని , బాగా పని చేయాలనీ కొత్త మంత్రులతో జరిగిన సమావేశంలో మోడీ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.

ఎవరు ఊహించని విధంగా అనేక మంది మంత్రులకు ఉద్వాసన పలికి ట్విస్ట్ ఇచ్చారు ప్రధాని ….ఫలానా మంత్రి పదవి పోతుందని ఎవరు అనుకోలేదు . మంత్రులకు ప్రధాని కార్యాలయం కాల్ చేసి మీరు మంత్రిపదవి రాజీనామా చేయాలనీ చెప్పేవరకు తెలియక పోవడంతో కాల్ అందుకున్న మంత్రులు షాక్ కు గురైయ్యారు. చేసేది లేక రాజీనామా లు సమర్పించి ప్రమాణ స్వీకారకార్యక్రమానికి హాజరైయ్యారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కు సింహభాగం

మోడీ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఐదు రాష్ట్రాలకు జరిగే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నారు . మొత్తం 43 మంది మంత్రులుగా ప్రమాణం చేయగా వారిలో 36 మంది కొత్త వారు ఉండటం విశేషం . ఇందులో యువకులకు ,మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ నుంచి 7 గురిని , మహారాష్ట్ర నుంచి 5 గురిని , పశ్చిమ బెంగాల్ నుంచి 4 గురిని కెబినెట్ లోకి తీసుకున్నారు. 2024 లో లోకసభకు జరిగే సాధారణ ఎన్నికలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు అర్థమౌతుంది. కరోనా వల్ల ఎప్పుడో జరగాల్సిన మంత్రువర్గ విస్తరణ ఆలశ్యంగా జరిగిందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కి ప్రమోషన్ …..

తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కడుగు కేంద్రంలో హోమ్ శాఖ సహాయ మరిత్రిగా ఉన్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మోడీ కెబినెట్ లో ప్రమోషన్ లభిచింది. కేంద్ర మంత్రుల పని తీరు ఆధారంగా మంత్రి పరువు లు ప్రమోషన్ లు కల్పించారు.

కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఢిల్లీలోని రాజ్ భవన్ లో జరిగింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు హాజరయ్యారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన నేతలు కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం…ఎంపీ నామ నాగేశ్వరరావు!

Drukpadam

కేసీఆర్.. నిన్ను దేవుడు అందుకే పుట్టించాడని అన్నావు కదా?: కిషన్ రెడ్డి

Ram Narayana

శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ ఏపీ ప్రభుత్వ తీర్మానం!

Drukpadam

Leave a Comment