Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అంతరాష్ట్ర నకిలీ విత్తనాల దందా ముఠా అరెస్ట్ : అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద

అంతరాష్ట్ర నకిలీ విత్తనాల దందా ముఠా అరెస్ట్ : అదనపు ఎస్పీ  నర్మద
– – మొత్తం 3 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు సీజ్
– – 6మంది అరెస్ట్, 8 సెల్ ఫోన్లు, 300 ఖాళీ ప్యాకెట్లు స్వాధీనం

నల్లగొండ
నకిలీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసి మూడు టన్నుల బిజీ-3 విత్తనాలను సీజ్ చేసినట్లు నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ  నర్మద తెలిపారు.శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ముఠా సభ్యుల నకిలీ విత్తనాల దందాకు సంబందించిన వివరాలను వెల్లడించారు. జిల్లా పోలీసులకు లభించిన నిర్దిష్ట సమాచారం మేరకు గడిచిన మూడు నెలలుగా ఈ నకిలీ దందా విషయంలో లోతుగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. అరెస్ట్ చేయబడిన 6 మంది నిందితులలో ఏ-2 మార్కవార్ రమేశ్ మహారాష్ట్ర కు చెందిన వ్యక్తి, జోగులంబ గద్వాల్ కు చెందిన మన్నెం లక్ష్మినారాయణ అను వ్యక్తి తన ముఖ్య అనుచర్లు అయిన గోరెంట్ల సురేశ్ బాబు, గొడవల్లి చంద్ర శేఖర్, గుమ్మరాల వెంకటేష్ వారితో కుమ్మకై ఆంద్ర మరియు కర్నాటక కు చెందిన రైతాల నుండి BG-III నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు సేకరించి, తమ అనుచరులైన కానాల మహేశ్, వడ్ల శివ, అరుణ్ ల ద్వారా బక్కిరెడ్డి శివ భూషణ్ రెడ్డి, బక్కి రెడ్డి పాండు రంగా రెడీ, గొల్ల వీరేశం, జూట్ల లక్ష్మి నారాయణ, గోరెంట్ల వెంకట్ రావు, చీకటి శ్రీనివాస్, నంబరి శ్రీనివాస్ లతో సుమారుగా 18 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను మహారాష్ట్ర కు చెందిన మార్కవార్ రమేశ్ కు పంపడం జరిగింది. వారు Kavya, Arunodaya, Raghava-9, Billa, Pavani, Sri Satya Seeds, Rajini Seeds, Rainbow Seed నకిలీ కంపనీల పేర్లతో కవర్స్ తయారు చేయించి, వాటిలో BG-III నకిలీ పత్తి విత్తనాలను ఎలాంటి ప్రొసెసింగ్ చేయకుండా Grow out test , Germination, genetic purity మొదలగు పరీక్షలు లేకుండా అనంతరం ట్రూత్ ఫుల్ లేబుల్స్ ను ముద్రించి నకిలీ పత్తి విత్తనాలను నాణ్యమైన విత్తనాలుగా నమ్మించేలా రసాయన రంగులు వినియోగించి ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి తరలించి అసలు పత్తి విత్తనాలు గా ఎక్కువ ధరకు అమ్ముతు రైతులను మోసం చేయుచున్నారు. ఇట్టి కేసులో కీలక వ్యక్తి అయిన మార్కవార్ రమేశ్ పైన గతములో మంచిర్యాల జిల్లా నందు 3 పోలీస్ స్టేషన్ పరిదిలో కేసులు నమోదు అయ్యి కాటెపల్లి పోలీసుల చేత అరెస్ట్ చేయబడి పి.డి. యాక్ట్ లో వరంగల్ జైలుకు తరలించారని చెప్పారు. జైలు నుండి విడుదల అయిన అనంతరం తన మోస ప్రవృత్తిని మార్చుకోకుండా నకిలీ పత్తి విత్తనాలను తెలంగాణ, మహారాష్ట్ర లోని పలు జిల్లాల్లో నకిలీ విత్తనాలను విక్రయించి లాభాలు పొందుతున్నాడు.

ఇదే సమాచారం పక్కాగా నల్లగొండ జిల్లా పోలీసులకు తెలియడంతో జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐలు బాలగోపాల్, ఎస్.ఎమ్. బాషా, చండూర్ సిఐ సురేష్ కుమార్, నల్లగొండ 1 టౌన్ సి.ఐ. ఎన్.సురేష్, ఎస్..ఐ. కె. నరేష్, మరో ఎస్.ఐ హెచ్.నరేష్ తదితరుల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ , పోలీస్ బృందాలు, ఇతర పోలీసుల సహకారంతో నకిలీ విత్తనాల దందా మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇందులో మొత్తము 15 మంది నేరస్థులు వుండగా 4 గురు నేరస్థులు అయిన A1-మన్నెం లక్ష్మీనారాయణ , A6-గుమ్మరాల వెంకటేశ్వర్లు , A9- బఖిరెడ్డి శివ భూషణ్ రెడ్డి, A-13 వెంకట్ రావు లు ఇది వరకే అరెస్ట్ అయినారు. ఈ రోజు aruగురు నేరస్థులను అరెస్ట్ చేయడం జరిగినది, మరో ఐదుగురు నేరస్థులు పరారీ లో వున్నారు.

నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కేనును చేధించడంలో సమర్ధవంతంగా పని చేసిన టాస్క్ ఫోర్స్ సిఐలు ఎస్.ఎమ్. బాషా, బాలగోపాల్, చండూర్ సిఐ సురేష్ కుమార్, నల్లగొండ 1 టౌన్ సి.ఐ. ఎన్.సురేశ్, యెస్.ఐ. కే. నరేశ్, యెస్.ఐ హెచ్.నరేష్ సిబ్బంది శ్రీను, రమేష్, రవుఫ్, ఇమ్రాన్, రాజు, రేవతి, శశి, అకీల్, షఫీ, సతీష్ తదితరులను డిఐజి ఏ.వి.రంగనాధ్ ప్రత్యేకంగా అభినందించినట్లు అదనపు ఎస్పీ నర్మద వివరించారు.

Related posts

మధ్యప్రదేశ్ లో దారుణం..

Drukpadam

కేరళలో బోల్తాపడిన ఏపీ భక్తుల బస్సు!

Drukpadam

భార్య‌ను స‌జీవంగా పూడ్చి పెట్టిన కసాయి భ‌ర్త‌!

Drukpadam

Leave a Comment