Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబును దీవించాలంటూ నోరు జారిన తెలంగాణ మంత్రి!

చంద్రబాబును దీవించాలంటూ నోరు జారిన తెలంగాణ మంత్రి!
పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న గంగుల
ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లతో వృద్ధులు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య
మంచి పథకాన్ని అందించిన చంద్రబాబును దీవించాలన్న వైనం

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణలో చంద్రబాబు పేరు మళ్లీ ఎక్కువగా వినిపిస్తోంది. చంద్రబాబు అనుచరుడు రేవంత్ అని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పొరపాటున చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గంగుల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంగుల ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లతో వృద్ధులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇంత మంచి పథకాన్ని అందించిన చంద్రబాబుకు దీవెనలు అందించాలా? వద్దా? అని ప్రశ్నించారు. ఆయన కడుపు చల్లగా ఉండాలని కోరుకోవాలా? వద్దా? అని అడిగారు. అయితే వెంటనే తాను చేసి తప్పును ఆయన గ్రహించారు. కేసీఆర్ అని చెప్పబోయి చంద్రబాబు అన్నట్టు గుర్తించారు. వెంటనే తన తప్పును సరిదిద్దుకుని ప్రసంగాన్ని కొనసాగించారు.

Related posts

చీమలపాడు లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పర్యటన..!

Drukpadam

ఘనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 98 వార్షికోత్సవాలు …

Drukpadam

ప్రధానిపై కేసీఆర్ పథకం ప్రకారం విషం చిమ్ముతున్నారు :కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజం!

Drukpadam

Leave a Comment