Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కత్తి మహేశ్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించిన కుటుంబ సభ్యులు

  • ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడిన కత్తి మహేశ్
  • చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • ఈ సాయంత్రం కన్నుమూత
  • రేపు స్వగ్రామం యలమందలో అంత్యక్రియలు

ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ కళ్లకు, తలకు బలమైన గామాలయ్యాయి. గత కొన్నిరోజులుగా ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కాగా, కత్తి మహేశ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు స్వస్థలానికి తరలించారు. 

కత్తి మహేశ్ స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని యలమంద (యర్రావారిపాలెం మండలం). రేపు యలమందలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

కాగా, కత్తి మహేశ్ సినీ ప్రముఖుడిగానే కాకుండా, అనేక సామాజిక అంశాలపై స్పందించే వ్యక్తి ఎంతోమందికి దగ్గరయ్యారు. కత్తి మహేశ్ తో వివిధ వేదికలు పంచుకున్న సాహితీవేత్తలు, హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, వివిధ రంగాలకు చెందిన ఇతరులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా “రిప్ కత్తి మహేశ్” అనే పోస్టులే దర్శనమిస్తున్నాయి.

Related posts

ప్రపంచంలోనే శక్తిమంతమైన బాంబును ఉక్రెయిన్ కు తరలించిన రష్యా!

Drukpadam

ఏపీ రాజధానిపై అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు సీజే!

Drukpadam

చీతాలను సరే బ్యాంకు మోసగాళ్లను ఎప్పుడు తీసుకొస్తారు ….మోదీపై ప్ర‌కాశ్ రాజ్ సెటైర్‌!

Drukpadam

Leave a Comment