Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నెరవేరిన 28 ఏళ్ల అర్జెంటీనా కల.. దేశానికి కోపా కప్‌ను అందించిన మెస్సీ!

నెరవేరిన 28 ఏళ్ల అర్జెంటీనా కల.. దేశానికి కోపా కప్‌ను అందించిన మెస్సీ
ఫైనల్‌లో బ్రెజిల్‌తో హోరాహోరీగా పోరు
ఏంజెల్ డీ మారియో గోల్‌తో టైటిల్ సొంతం
అర్జెంటీనాలో మిన్నంటిన సంబరాలు

ప్రంపంచంలో ఫుట్ బాల్ ఆటకు ఉన్న క్రేజీ అంత ఇంతా కాదు … స్టేడియం లలో కొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారిడోనా మాయాజాలంతో ప్రపంచ కప్ ను గెలుచుకున్న సందర్భాన్ని ఇప్పటికే ప్రపంచ ఫుట్ బాల్ ప్రేమికులు గుర్తు చేసుకుంటారు. ఫుట్ బాల్ అంటే టక్కున గుర్తు వచ్చే పేరు డిగో మారిడోనా ఇప్పుడు మెస్సీ …అంతటి ప్రఖ్యాతులు సంపాదించారు. కోపా అమెరికా 2021 కప్ లో దుమ్మురేపిన అర్జెంటీనా ఫైనల్ పోరులో బ్రెజిల్ ని మట్టి కరిపించి కప్ ను సొంతం చేసుకొన్నది ….

కోపా అమెరికా 2021 ఫైనల్‌లో అర్జెంటీనా దుమ్మురేపింది. లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా అతిపెద్ద టోర్నీని కైవసం చేసుకుని రికార్డులకెక్కింది. బ్రెజిల్‌తో హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో 1-0 గోల్స్‌తో విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకుంది. ఏంజెల్ డీ మారియా సాధించిన గోల్ అర్జెంటీనాను విజేతగా నిలిపింది. ఫలితంగా 15వ సారి కోపా టైటిల్‌ను సొంతం చేసుకుని అత్యధిక టైటిళ్లు సాధించిన ఉరుగ్వే సరసన నిలిచింది. మెస్సీ కెరియర్‌లో ఇదే మొదటి అంతర్జాతీయ టైటిల్ కావడం గమనార్హం.

దేశానికి అంతర్జాతీయ టైటిల్‌ను తీసుకురావాలన్న మెస్సీ కల ఇన్నాళ్లకు నెరవేరింది. దిగ్గజ ఆటగాడైన డీగో మారడోనా నేతృత్వంలో కూడా అర్జెంటీనా కోపా టైటిల్‌ను సాధించలేకపోయింది. 1973లో తొలిసారి అర్జెంటీనా కోపా కప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 1993లో చివరిసారి దక్కించుకుంది. 28 ఏళ్ల నిరీక్షణకు తెరిదించుతూ మరోమారు కప్‌ను సొంతం చేసుకుంది. కోపా కప్ సొంతం కావడంతో అర్జెంటీనాలో సంబరాలు మిన్నంటాయి.

 

అర్జెంటీనా టీమ్ సంబరాలు చేసుకుంటుంటే నేమార్ ను ఓదార్చిన మెస్సీ… స్నేహానికి నిదర్శనం 

హతాశుడైన బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేమార్
నేమార్ ను హత్తుకుని ఊరడించిన మెస్సీ

రెండున్నర దశాబ్దాల తర్వాత కోపా అమెరికా కప్ ను అర్జెంటీనా జట్టు గెలుచుకుంది. అది కూడా చిరకాల ప్రత్యర్థి బ్రెజిల్ ను ఫైనల్లో ఓడించడంతో అర్జెంటీనాలో వరల్డ్ కప్ గెలిచినంతగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఫైనల్ మ్యాచ్ ముగిశాక అర్జెంటీనా టీమ్ పరవళ్లు తొక్కే ఉత్సాహంతో వేడుకలు చేసుకోగా, బ్రెజిల్ ఆటగాళ్లు తీవ్ర నిరాశానిస్పృహలతో కనిపించారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు నేమార్ జూనియర్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ సందర్భంగా అసలైన స్నేహానికి నిదర్శనం అనిపించే కొన్ని చిరస్మరణీయ క్షణాలు ఆవిష్కృతమయ్యాయి.

కోపా అమెరికా ఫైనల్లో ఓటమి పట్ల తీవ్ర వేదనకు లోనైన తన మిత్రుడు నేమార్ ను అర్జెంటీనా స్టార్ మెస్సీ హత్తుకుని ఓదార్చడం అందరినీ ఆకట్టుకుంది. ఓ చిన్న పిల్లవాడిలా బాధపడుతున్న నేమార్ ను హృదయానికి హత్తుకుని అతని వేదనను తగ్గించే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

నేమార్, మెస్సీ… ఫుట్ బాల్ ప్రపంచంలో రారాజులు. ఒకరేమో బ్రెజిలియన్, మరొకరేమో అర్జెంటీనా జాతీయుడు. కానీ వీరిద్దరినీ కలిపింది బార్సిలోనా ఫుట్ బాల్ క్లబ్. గతంలో వీరిద్దరూ యూరప్ లీగ్ పోటీల్లో బార్సిలోనా క్లబ్ కు ప్రాతినిధ్యం వహించారు. తమ సాకర్ నైపుణ్యంతో బార్సిలోనా జట్టుకు అనేక విజయాలు అందించారు. ఆ సందర్భంగా ఏర్పడిన చెలిమి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. తాజాగా కోపా అమెరికా టోర్నీ ఫైనల్ ముగిసిన తర్వాత తమ అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు.

Related posts

వామ్మో పులస.. రూ.26 వేలకు కొన్న రాజకీయ నాయకుడు!

Ram Narayana

నూతన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

Drukpadam

పల్లెల ప్రగతి ,పట్టాన ప్రగతిపై కేసీఆర్ సమీక్ష;తాను ఒక జిల్లా దత్తత

Drukpadam

Leave a Comment