Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జీవో నెం.2 సస్పెన్షన్ ను స్వాగతించిన రాష్ట్ర పంచాయతీ పరిషత్…

జీవో నెం.2 సస్పెన్షన్ ను స్వాగతించిన రాష్ట్ర పంచాయతీ పరిషత్
మంచిదే సరిదిద్దుకుంటామన్న మంత్రి పెద్దిరెడ్డి
మల్లి జి ఓ ఇస్తామని వెల్లడి
సర్పంచ్, సెక్రటరీల అధికారాలు వీఆర్ఓలకు బదలాయింపు
గతంలో జీవో తెచ్చిన ప్రభుత్వం
పిటిషన్ దాఖలు చేసిన తురకపాలెం సర్పంచ్
నేడు విచారణ కొనసాగించిన హైకోర్టు
కోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలన్న జాస్తి ఆంజనేయులు

గ్రామ సచివాలయాలకు మరిన్ని అధికారాలు బదలాయించే జీవో నెం.2ను హైకోర్టు సస్పెండ్ చేయడంపై రాష్ట్ర పంచాయతీ పరిషత్ అధ్యక్షుడు జాస్తి ఆంజనేయులు స్పందించారు. సర్పంచుల అధికారాలను జీవో-2 హరిస్తోందని అన్నారు. హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సర్పంచులు, గ్రామ కార్యదర్శుల అధికారాలను కొన్నింటిని వీఆర్ఓలకు బదలాయిస్తూ గతేడాది మార్చి 25న ఏపీ ప్రభుత్వం జీవో నెం.2 తీసుకువచ్చింది. అయితే ఈ జీవోను గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ సవాల్ చేశారు. దీనిపై నేడు విచారణ కొనసాగించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రానికి అధిపతి సీఎం అయితే, గ్రామానికి అధిపతి సర్పంచి అని, వారి అధికారాలను ఎలా బదలాయిస్తారని విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది.

జీవో నెం.2ని కోర్టు సస్పెండ్ చేయడంపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన

పంచాయతీ సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శుల అధికారాల్లో కొన్ని వీఆర్ఓలకు బదలాయించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో నెం.2 జారీ చేయడం తెలిసిందే. ఈ జీవోను ఇవాళ హైకోర్టు ధర్మాసనం సస్పెండ్ చేసింది. కోర్టు ఆదేశాలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. జీవో నెం.2లో లోపాలు ఉన్నాయని తాము గుర్తించామని, ఆ లోపాలను సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పారు. సర్పంచ్ ల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు. అయితే, లోపాలను సరిదిద్దే లోపే కొందరు కోర్టును ఆశ్రయించారని వెల్లడించారు.

పరిపాలనా సౌలభ్యం కోసమే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామని, వాటిని తగిన విధంగా బలోపేతం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పుడెలాగూ కోర్టు జీవోను కొట్టివేసింది కాబట్టి, లోపాలను సరిదిద్దుకుని మళ్లీ జీవో జారీ చేస్తామని వెల్లడించారు. దీనిపై న్యాయ విభాగంతోనూ, సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.

Related posts

హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. 30 మంది ఐపీఎస్‌ల బదిలీ

Drukpadam

హామీలు ఇచ్చే పార్టీలు వాటిని ఎలా నెరవేరుస్తాయో చెప్పాలి: ఎన్నికల సంఘం!

Drukpadam

చత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్… ఒక మావోయిస్టు మృతి

Drukpadam

Leave a Comment