Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

యూట్యూబ్ ఛానల్ రిపోర్ట్స్ అయినా ప్రతి జర్నలిస్టులకు రక్షణ ఉంటుంది : సుప్రీం కోర్టు

యూట్యూబ్ ఛానల్ రిపోర్ట్స్ అయినా ప్రతి జర్నలిస్టులకు రక్షణ ఉంటుంది : సుప్రీం కోర్టు
ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా పై దేశ ద్రోహం కేసు సుప్రీంకోర్టు కొట్టివేసింది.
1962 నాటి కోర్టు తీర్పును ప్రస్తహించిన న్యాయస్థానం

ఈ సందర్భంగా 1962 నాటి కోర్టు తీర్పును ప్రస్తహించిన న్యాయస్థానం . ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కు ఉందని పేర్కొంది.

గత ఏడాది ఢిల్లీలో జరిగిన అల్లర్లపై వినోద్ దువా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేశాడు. అయితే అందులో తప్పుడు కథనాలు ప్రసారాలు చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేశారని ఆరోపిస్తూ హిమాచలప్రదేశ్ బాజాపా నేత ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు రాజద్రోహం కేసు నమోదయింది. ఈ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ వినోద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ జరిపి సర్వోన్నత న్యాయస్థానం.. అతడిపై సత్వర చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించింది.

తాజాగా ఈ కేసులో జస్టిస్ యూ యూ లలిత్, జస్టిస్ వినీత్
శరణ్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది…. వినోద్ దువా పై రాజద్రోహం, ఇతర కేసుని కొట్టివేసింది. 1962 నాటి కేదార్ నాథ్ సింగ్ తీర్పు ప్రకారం.. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టు కు రక్షణ ఉందని గుర్తు చేసింది. చట్టబద్ధమైన మార్గాలు ద్వారా మార్పు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తే, అందుకు బలమైన పదాలను ఉపయోగించి నంత మాత్రాన రాజద్రోహం కాదని 1962 నాటి సుప్రీం కోర్టు తీర్పు చెబుతోందని ధర్మాసనం తెలిపింది.

వినోద్ దువా పైనే కాకుండా రాజదీప్ సర్దేశాయ్ తోపాటు , మరు ఆరుగురు జర్నలిస్టులపై వివిధ రాష్ట్రాలలో కేసు నమోదు అయింది. వీరితో పటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పై కూడా కేసు నమోదు అయింది. అప్పట్లేనే దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. వీరిని అరెస్ట్ చేయవద్దని సుప్రీం స్పష్టం చేసింది.

Related posts

కవితను 10 గంటలు విచారించిన ఈడీ అధికారులు

Drukpadam

కేసీఆర్ సారు జర్నలిస్టుల గోడు వినండి మీరు ….

Drukpadam

నేనో ఫైల్యూర్ పొలిటిసిన్ ను …అంగీకరించిన పవన్ కళ్యాణ్!

Drukpadam

Leave a Comment