ఖమ్మం వార్తలు

అభివృద్ధి కార్యక్రమాలను వేగిరపరచాలి ….కలెక్టర్ కు మంత్రి పొంగులేటి సూచన

అభివృద్ధి కార్యక్రమాలను వేగిరపరచాలని రాష్ట్ర రెవెన్యూ , గృహనిర్మాణ , సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో భేటీ అయ్యారు …ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలు జిల్లాలో అమలు అవుతున్న పథకాలు గురించి చర్చించారు …అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని మంత్రి అన్నారు …పని చేయని అధికారులను వెంటనే మార్చాలని అన్నారు ..జిల్లాకు అవసరమైన నిధులు పథకాలు ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని రానున్న కాలంలో మరింత వేగంగా పనులను పరుగెత్తించాలని మంత్రి పేర్కొన్నారు …

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో భేటీ అయిన తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి….

ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న పథకాల పై చర్చించారు.

Related posts

12న నూరేళ్ల అరుణ కేతనం ఆవిష్కరణ

Ram Narayana

కొత్తగూడెం జిల్లాలో రూ.52 లక్షల విలువైన గంజాయి పట్టివేత…

Ram Narayana

విజయవంతంలో … ఆద్యంతం తుమ్మలే

Ram Narayana