ఖమ్మం వార్తలు

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.
మార్చి 2024 నుండి పదవి విరమణ పొందిన ఉపాధ్యాయ, ఉద్యోగుల జేఏసీ డిమాండ్ .
రిటైర్ అయిన ఉద్యోగులకు ఇచ్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

తెలంగాణ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతుంది …ప్రత్యేకించి 35 నుంచి 40 సంవత్సరాలుగా ప్రభుత్వ సేవకులుగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ రాక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల మోర పాలకులు పట్టించుకోకపోవడం గరం గరంగా ఉన్నారు … నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు …

మార్చి 2024 నుండి రిటైర్ అయిన ఉపాధ్యాయ, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం ఆదివారం ఖమ్మం గవర్నమెంట్ ఉన్నత పాఠశాల రిక్కా బజార్ నందు సింగారపు జయరామ్ అధ్యక్షతన సమావేశమై క్రింది తీర్మానాల్ని రిటైర్మెంట్ ఉద్యోగుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించింది

మార్చి 2024 నుండి రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయిన కమిటేషన్, గ్రాటిటి ,జిపిఎఫ్ ,న్యూ శాలరీ , జి ఐ ఎస్ ,ఈ .ఎల్ ఎన్కాష్మెంట్, పిఆర్సి
ఏరియర్స్ వెంటనే విడుదల చేయాలని లేకపోతె పోరుబాట తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించింది

ప్రభుత్వం ప్రతినెల 700 కోట్లు పెండింగ్ బిల్లులు ఉద్యోగులకు ఇచ్చే చెల్లింపులో 2024 మార్చి నుండి రిటైర్ అయిన వారికి కూడా ప్రత్యేక కోటా ప్రకటించాలని సమావేశం డిమాండ్ చేసింది .

20 నెలల నుండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక కుటుంబ పోషణ భారమై ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఇబ్బందులు , ఆర్థిక దయనీయ స్థితిని దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో న్యాయం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రిని కోరుతూ సమావేశం తీర్మానించింది …

Related posts

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి….. జిల్లా కలెక్టర్

Ram Narayana

కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు …ఖమ్మంలో పాల్గొన్నమంత్రి తుమ్మల

Ram Narayana

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పలరింపులు ,పరామర్శలతో బిజీ బిజీ

Ram Narayana