పాలేరులో చేపపిల్లలను వదిలిన మంత్రి పొంగులేటి!
ఈ ప్రభుత్వం మీది ..మీరు కోరుకొని తెచ్చుకున్నారు
ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి మొఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యం
ఇళ్లు లేని వారందరికీ దశలవారీగా ఇళ్లు
వరదలకు ఇళ్లు కొట్టుకొని పోయినవారికి వెంటనే ఇళ్లు ఇస్తాం
కూసుమంచి మండలం పాలేరు జలాశయం లో చేపపిల్లల విడుదల కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు …ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు , వరదల వాళ్ళ మత్సకారుల తీవ్రంగా నష్టపోయారని వారిని అందుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు ..ఇది ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం పేదలకు అన్యాయం జరగదు …తమ ప్రతి అడుగు ఆలోచన ప్రజల కోసమేనని అన్నారు . ప్రజలు కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో పేదవాడి మోములో చిరునవ్వు చూడటమే లక్ష్యం అని అన్నారు ..ఇటీవల వచ్చిన వరదలకు పూర్తిగా ఇళ్లు దెబ్బతిన్న వారికీ త్వరలోనే ఇళ్లు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు ..ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎల్లప్పుడూ అందుబాటులు ఉంది సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు ..గ్రామాలల్లో మౌలిక సదుపాయాల కల్పనా శివారు ప్రాంతాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు చేపడతామని అన్నారు …నియోజకవర్గ ప్రజలు ఎప్పడు ఏది కావాలన్నా తమ తలుపు తట్టవచ్చునని వేళ్ళ వేళల అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు …కూసుమంచి ,ఖమ్మంలో తమ క్యాంపు కార్యాలయాలు ప్రజలు అందుబాటులో ఉంటాయని అక్కడ తమ సిబ్బందిని సంప్రదించవచ్చునని అన్నారు ..