Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిశోర్…

రాహుల్ గాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిశోర్
భేటీలో పాల్గొన్న ప్రియాంక గాంధీ
ఈ భేటీపై పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ
తృతీయ కూటమి ఏర్పాటు గురించి చర్చించారా? అనే సందేహాలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రియాంకగాంధీ కూడా పాల్గొన్నారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ఆ రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సీఎం అమరీందర్ తో నవజ్యోత్ సింగ్ సిద్ధూ విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీలతో ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, పంజాబ్ ఎన్నికల గురించి వీరు చర్చించుకున్నారా? లేక జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటు చేయాలనే కోణంలో భాగంగా కలిశారా? అనే చర్చ జరుతుతోంది. ఈ భేటీకి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది . ఇటీవల ప్రశాంత్ కిషోర్ సీనియర్ నేత ఎన్సీపీ కు చెందిన మరాఠా యోధుడు శరద్ పవర్ తో భేటీ అయ్యారు . అంతకు ముందు ఆయన బెంగాల్ ఎన్నికల తరువాత ఇక నుంచి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించబోనని చెప్పారు.తరువాత రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే తాను పని చేస్తానని ప్రకటించారు. తరువాత దేశరాజకీయాలలో మూడవ ఫ్రంట్ వాదనలు ముందుకు వచ్చాయి. శరద్ పవర్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాల నుంచి పోటీకి నిలపాలని ప్రతిపాదనలు వచ్చాయి. కాంగ్రెస్ లేని ఫ్రంట్ వ్యర్థమని శరద్ పవర్ తోపాటు ఆర్జేడీ నేత అభిప్రాయపడ్డారు . దీంతో రాహుల్ ,ప్రియాంక భేటీ పై రరకాల చర్చలు జరుగుతున్నాయి.

Related posts

అమిత్ షా పార్లమెంటులో అబద్ధం చెప్పారు… ‘నాగాలాండ్ ఘటన’పై నిరసనకారుల ధ్వజం!

Drukpadam

శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది: మంత్రి జోగి రమేశ్!

Drukpadam

తెలుగు రాష్ట్రాల నుంచి 6 గురు రాజ్యసభకు ఏకగ్రీవమే ….!

Drukpadam

Leave a Comment