Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్ యస్ కసరత్తు

ఖమ్మం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్ యస్ కసరత్తు
సామజిక వర్గాల లెక్కలపై తర్జన భర్జన
వైశ్య ,కమ్మ ఎవరికీ మేయర్ ఛాన్స్
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం అధికార టీఆర్ యస్ కసరత్తులు ప్రారంభించింది.ఈసారి మేయర్ ఫీఠం జనరల్ మహిళకు కేటాయించటం తో ఏ సామాజికవర్గానికి ఇవ్వాలనేదానిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి.ఖమ్మం లో మొదటి నుంచి వైశ్య సామాజికవర్గం ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేది .ఇప్పటి వరకు ఖమ్మం లో బలమైన సామజిక వర్గాలలో ఒకటిగా ఉన్న వైశ్యులకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదనే అభిప్రాయాలూ బలంగా ఉన్నాయి . కాంగ్రెస్ తరువాత తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రము లో అధికారంలోకి వచ్చింది. కానీ ఆపార్టీ కూడావైశ్యులను గుర్తించలేదు. దీనిపై వారిలో తీవ్ర అసంతృప్తి ఉంది. అంతకు ముందు కాంగ్రెస్ , వామపక్షాలతో ఉన్న కొంత మంది వైశ్యులు తెలంగాణ రాష్ట్రము ఏర్పడి టీఆర్ యస్ అధికారంలోకి వచ్చినతరువాత వారిలో కొంత మార్పు వచ్చింది . ప్రత్యేకించి పువ్వాడ అజయ్ ఖమ్మం శాసన సభ్యడుగా ఎన్నిక అయినా తరువాత ,ఆవర్గాలతో మంచి సంభందాలను కొనసాగిస్తున్నాడు. అయినప్పటికీ తాము ఓటు బ్యాంకు గానే ఉపయోగపడుతున్నాము తప్ప తమకు అధికారంలో భాగస్వామ్యం లేదనే అభిప్రాయం వైశ్యులలో ఉంది . దాన్ని తొలగించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈసారి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించటంతో ఎవరికీ ఇవ్వాలనే తర్జన ,భర్జనలు జరుగుతున్నట్లు తెలుస్తుంది . జనరల్ మహిళలలో కమ్మ , వైశ్య, బ్రాహ్మణ ,రెడ్డి, ముస్లిం , తదితర సామజిక వర్గాలు ప్రధానంగా ఖమ్మం లో ఉన్నాయి. సామజిక వర్గాల పరంగా చుస్తే కమ్మ లేదా వైశ్యులకు మేయర్ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఖమ్మం సామాజిక వర్గం నుంచి అజయ్ మంత్రిగా ఉన్నారు. ఖమ్మం ఎంపీ గా నామ నాగేశ్వరరావు ఉన్నారు. తిరిగి ఇదే సామజిక వర్గం నుంచి మేయర్ అభ్యర్థిని ఎంపిక చేస్తే తప్పుడు సిగ్నల్స్ వెళతాయని అభిప్రాయంతో మంత్రి ఉన్నట్లు సమాచారం . పైగా తాను పోటీచేసిన రెండు సార్లు తనకు అండగా నిలబడిన వైశ్య లకు మేయర్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మంత్రి ఉన్నట్లు తెలుస్తున్నది. మేయర్ ఎంపికలో మంత్రి పువ్వాడ అజయ్ దే కీలక పాత్ర కానున్నది . ఆయన జిల్లా మంత్రి తో పాటు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఖమ్మం కార్పొరేషన్ గెలుపు అధికార టీఆర్ యస్ కు అత్యంత ప్రతిష్టాత్మకం . అందువలన మంత్రి అందుకు తగ్గట్లుగా వ్యూహాలను రచిస్తున్నారు. గత నెలరోజులుగా కార్పొరేషన్ డివిజన్ల మీద కేంద్రీకరించి పనిచేస్తున్నారు.అందుకు సీనియర్ నేతలతో కమిటీ లను ఏర్పాటు చేయడంతో పాటు వారి పర్యేక్షణ నిరంతరం ఉండేవిధంగా చేస్తున్నారు . డివిజన్లవారీగా సభలు , సమావేశాలు వేర్పాటు చేసి కార్యకర్తలను ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నారు.కార్పొరేటర్లు ను కూడా ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 50 డివిజన్లు గా ఉన్న కార్పొరేషన్ 60 అవుతున్నందున పాత డివిజన్ల సరిహద్దులు మారనున్నాయి.ఈ సారి గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చే కసరత్తు పకడ్భందిగా జరుగుతుంది .అందుకే ఆశావహులు మంత్రి ప్రాపకం కోసం తిప్పలు పడుతున్నారు.మరికొద్ది రోజుల్లో మేయర్ అభ్యర్థి ఫైనల్ అయితే టీఆర్ యస్ ప్రచారం ఉరుకులు పరుగులుగానే ఉంటుందని టీఆర్ యస్ వర్గాలు అంటున్నాయి.

Related posts

కాంగ్రెస్ సాధు జంతువు …బీజేపీ పులి …కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి !

Drukpadam

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విద్యార్హతలపై బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు

Drukpadam

ఆప్ఘ‌నిస్థాన్‌లోని పంజ్‌షీర్‌ మొత్తాన్ని అధీనంలోకి తెచ్చుకున్నాం: తాలిబ‌న్ల ప్ర‌క‌ట‌న‌!

Drukpadam

Leave a Comment