ఖానామెట్ లో ఎకరం రూ.55 కోట్లా! ప్రభుత్వ భూములకు సర్కార్ వేలం
తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలానికి విశేష ప్పందన…
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ భూముల వేలం
వేలం నిర్వహిస్తున్న హెచ్ఎండీఏ
ఖానామెట్ లో 5 ప్లాట్లు వేలం
ప్రభుత్వానికి రూ.729 కోట్ల ఆదాయం
తొండాలు గుడ్లు పెట్టని భూములు అని నిన్న మొన్నటివరకు హేళన చేశారు. ఆ తొండలు గుడ్లు పెట్టని భూములే నేడు బంగారు గుడ్లు పెడుతున్నాయి. వజ్రాలు ,వైడూర్యాలు కుమ్మరిస్తున్నాయి. ఇది నిజంగా పచ్చి నిజం … ఇంతకీ ఇవి ఎక్కా అంటారా ? గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ఖానా మెట్ లో జరిగిన వేలంలో వచ్చిన ధర … అక్షరాల 55 కోట్లు అంతే ఇంతటి దార పలకడానికి కారణం ఏమిటి అని అనుకుంటున్నారా ? ప్రపంచపటంలో ఇప్పడు హైద్రాబాద్ కు ఉన్నంత క్రేజీ ఎక్కడ లేదంట అతిశేయోక్తి కాదు …..
హైదరాబాదు శివార్లలోని ప్రభుత్వ భూములను హెచ్ఎండీఏ వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న కోకాపేట పరిధిలో వేలం వేయగా అత్యధికంగా ఎకరం రూ.45 కోట్లు పలికింది. ఇవాళ ఖానామెట్ పరిధిలోని భూములను వేలం వేయగా గరిష్ఠంగా ఎకరం రూ.55 కోట్లు పలకడం విశేషం. ఖానామెట్ లోని 15 ఎకరాల భూమిలో 5 ప్లాట్లకు నేడు వేలం చేపట్టారు. ఖానామెట్ భూముల విక్రయం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఖానామెట్ భూముల వేలంలో సగటున ఎకరం ధర రూ.48.92 కోట్లు పలికింది.
ఈ వేలంలో… మంజీరా కన్ స్ట్రక్షన్స్ సంస్థ రూ.160.60 కోట్లతో 2.92 ఎకరాలను, జీవీపీఆర్ లిమిటెడ్ రూ.185.98 కోట్లతో 3.69 ఎకరాలను, లింక్ వెల్ టెలీ సిస్టమ్స్ రూ.153.09 కోట్లతో 3.15 ఎకరాలను, అప్ టౌన్ లైఫ్ ప్రాజెక్ట్స్ రూ.137.34 కోట్లతో 3.15 ఎకరాలు, లింక్ వెల్ టెలీ సిస్టమ్స్ రూ.92.40 కోట్లతో మరో రెండు ఎకరాలను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది .