Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం టీఆర్ యస్ లో సమన్వయం కోసం నామ చేస్తున్న కృషి ఫలిస్తుందా?

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ లో సమన్వయం కోసం నామ చేస్తున్న కృషి ఫలిస్తుందా?
ఖమ్మం జిల్లా టీఆర్ యస్ లో నెలకొన్న వర్గ విభేదాలపై ఎంపీ నామ నాగేశ్వరరావు దృష్టి సారించినట్లు అయన కదలికలను బట్టి అర్థం అవుతుంది . ఆయన చేస్తున్న కృషి ఎంతవరకు ఫలిస్తుందా? అనే ఆశక్తి నెలకొన్నది . ఎంపీ గా లోకసభ టీఆర్ యస్ పక్ష నేతగా ఉన్న నామ జిల్లా టీఆర్ యస్ లో జరుగుతున్నా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నాయకుల మధ్య తగాదాలు తగ్గించి సమన్వయ పరచాలనే పట్టుదలతో అడుగులు వేస్తున్నారు.
జిల్లాలో టీఆర్ యస్ బలమైన పార్టీగా ఉన్నప్పటికీ నాయకుల మధ్య సఖ్యత కొరవడింది. సమన్వయం లోపించింది. కొందరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే స్థాయిలో బేధాభిప్రాయాలు ఉన్నాయి.నాయకుల మద్యే కాకుండా గ్రామస్థాయిలో వర్గాలుగా చీలిపోయారు. ఘర్షణ వాతావరణం నెలకొన్నది . పెద్ద నాయకుల మధ్య మాటలు కూడా కరువయ్యాయి . కలిస్తే ఎవరి మనసులో వారికీ ఉన్నప్పటికీ పెదాలపై మాత్రమే పలకరింపులు ,తరువాత ఈసడింపులు , మనుసులో ఒకరినొకరు ద్యేశించుకునేంత కోపం . ప్రవేట్ సంభాషణలలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం జరుగుతుంది. ఒకేపార్టీ కానీ ఒకరంటే ఒకరికి పడదు. దింతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది మరింత దూరం పొతే పార్టీకి నష్టం అనుకున్న నామ అందుకు తాను చేయగలిగింది ఏమిటనే ఆలోచనలకు కొంతకాలంగా పదును పెడుతున్నారు.
ఇటీవల రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ సమక్షంలో జరిగిన జిల్లా నేతల సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ వస్తుందని చాలామంది నాయకులూ అనుకున్నారు. కానీ కేటీఆర్ ఎవరిని నొప్పించకుండానే సున్నితంగా హెచ్చరికతో కూడిన సూచనలు చేశారు. అందరు కలిసి పనిచేయాలన్నారు. ప్రోటోకాల్ పాటించాలన్నారు. జిల్లాలో సమస్యలను మంత్రికి చెప్పాలని ,అక్కడ కూడా పరిస్కారం కాకపోతే తన దృష్టికి తేవాలన్నారు. కానీ ఎవరిని ప్రత్యేకంగా పేరుపెట్టి ఏమి అనలేదు. ఈసందర్బంగా మాజీమంత్రి తుమ్మల తోనూ , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోనూ వీడివీడిగా మాట్లాడారు. జిల్లా టీఆర్ యస్ నాయకుల మధ్య నెలకొన్న వార్ పై ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడు కుంటున్నారు. దీనికి తోడు ఈమధ్య ప్లెక్సీల వార్ తోడైంది . దీంతో పార్టీకి మరింత నష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించిన నామ రంగంలోకి దిగారు . ఇంతకాలం జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్న నామ ఇక లాభం లేదనుకున్నారో లేక అధినేత కెసిఆర్ , వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు రంగంలోకి దిగారో తెలియదు కానీ జిల్లా లో నాయకుల మధ్య నెలకొన్న పొర పొచ్చాలను , తగాదాలను దూరం చేసి పార్టీని పటిష్ట పరచాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు . అందులో భాగంగానే వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ , మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మధ్య నెలకొన్న అభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేశారు. మొదటిసారిగా వారిరువురికి ఒకే వేదిక పైకి తెచ్చారు. అదే విధంగా సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య స్థానిక నేతల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా తల్లాడ మండలంలోని జక్కంపూడి కృష్ణమూర్తి ఇంటికి వెళ్లారు .అంతకు ముందు మంత్రి అజయ్ , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య ఉన్న భేదాలను తొలగించాలని చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే ఫలించి తిరిగి ఎప్పటి ఆటలాగానే మారటంతో కొంత నిరుత్సవం చెందిన నామ తిరిగి వారిని కలిపేందుకు కృషి ప్రారంభించారు. ఇరువురి నేతలతో సమావేశం అయ్యారు.ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Related posts

అక్టోబ‌ర్ 24న తెలంగాణ‌లోకి రాహుల్ గాంధీ యాత్ర‌…

Drukpadam

శశి థరూర్ పై భగ్గుమన్న కాంగ్రెస్..

Drukpadam

చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ల హత్యకు కుట్ర…టీడీపీ నేత బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు !

Drukpadam

Leave a Comment