మోడీ ,శరద్ పవర్ భేటీ దేనికి సంకేతం …రాజకీయవర్గాలలో ఆశక్తికర చర్చ
మోదీతో శరద్ పవార్ కీలక భేటీ.. 50 నిమిషాలు కొనసాగిన సమావేశం
మోదీ నివాసంలో కొనసాగిన సమావేశం
రాష్ట్రపతి రేసులో పవార్ ఉన్నారనే వార్తలు
రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న భేటీ
ప్రతిపక్షాల తరుపున ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి రాష్ట్రపతి రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతున్న శరద్ పవర్ శనివారం ప్రధాని మోడీ తో భేటీ కావడం దేశ రాజకీయాలు ఒక్కసారిగా అటువైపు మళ్లాయి. ప్రతిపక్షాల తరుపున తన గొంతుని వినిపిస్తాడని అనుకుంటున్న శరద్ పవర్ ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా మోడీని కలవడం దేనికి సంకేతం అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో ప్రతిపక్షాలను ఐక్యం చేయగలదని భావిస్తున్న పవర్ లాంటి నేత తో ప్రధాని మోడీ ఏమి మాట్లాడి ఉంటారని రాజకీయ విశ్లేషకులు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. మోడీ ,ప్రభ తగ్గిందని వార్తలు వస్తున్నా వేళ పవర్ ను రాష్ట్రపతిగా ప్రతిపాదించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ? అనే సందేహాలు కూడా కలుగు తున్నాయి.
దేశ రాజకీయాల్లో నిజంగా ఇది ఊహించని పరిణామమే . ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ దేశరాజకీయాల్లో ఆశక్తికర అంశమే . ఢిల్లీలోని మోదీ నివాసానికి శరద్ పవార్ శనివారం ఉదయం వెళ్లారు. వీరిద్దరి సమావేశం దాదాపు 50 నిమిషాల సేపు కొనసాగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
భారత రాష్ట్రపతి రేసులో శరద్ పవార్ ఉండబోతున్నారని… ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమైన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రపతి పదవికి తాను పోటీ చేయబోనని పవార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మోదీతో పవార్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఎన్సీపీ అధికారాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంపై ఈ భేటీ ఏ మేరకు ప్రభావాన్ని చూపబోతోందనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది.