- వాషింగ్టన్ డీసీలో ఘటన
- -12 రౌండ్ల కాల్పులు జరిపిన వ్యక్తి
- -మ్యాచ్ రద్దు చేసిన అధికారులు
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఓ వ్యక్తి 12 రౌండ్లు కాల్పులు జరిపి కలకలం రేపాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. వాషింగ్టన్‌లోని నేషనల్స్ పార్క్ బేస్‌బాల్ మైదానంలో మ్యాచ్ జరుగుతోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కాల్పుల చప్పుడు వినపడగానే కొందరు ప్రేక్షకులు మైదానం నుంచి బయటకు పరుగులు తీయగా, ఆటగాళ్లు కూడా పిచ్ నుంచి బయటకు వెళ్లారు. దీంతో ఈ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాల్పులకు తెగబడిన వ్యక్తికోసం గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు.