Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మరియమ్మ లాక్ అప్ డెత్ kesu లో ఎస్ ఐ ,ఇద్దరు కానిస్టేబుళ్ల ను ఉద్యోగాలు తొలగించిన తెలంగాణ ప్రభుత్వం ….

మరియమ్మ లాక్ అప్ డెత్ kesu లో ఎస్ ఐ ,ఇద్దరు కానిస్టేబుళ్ల ను ఉద్యోగాలు తొలగించిన తెలంగాణ ప్రభుత్వం ….
విచారణ జరిపి చర్యలు తీసుకున్నామన్న రాచకొండ సి పి మహేష్ భగత్
-రాష్ట్రంలో సంచలనంగా మరీనా మరియమ్మ కేసు
-ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చర్యలు
-మరియమ్మ కుమారుడికి ఉద్యోగం ఆర్థిక సహాయం

రాష్ట్రంలో సంచలనంగా మారిన దళిత మహిళ మరియమ్మ లాక్ అప్ డెత్ వ్యవహారంలో భాద్యత రహితంగా ప్రవర్తించిన ఎస్ ఐ మహేష్ , మరియి ఇద్దరు కానిస్టేబుళ్ల జానయ్య ,రషీద్ లను ఉద్యోగం నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోరుట్ల గూడం కు చెందిన మరియమ్మ ను అడ్డగూడూర్ పోలీసులు వచ్చి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకోని వెళ్లారు. ఆమె పిల్లలు , కాళ్ళ వేళ్ళ పడ్డప్పటికీ కనికరించకుండా అతి కిరాతకంగా వ్యవహరించారు. చింతకాని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళు అక్కడ లాఠీలతో విఫరీతంగా కొట్టారు. అడ్డుపోయిన కూడుకుని సైతం వదల్లేదు .అక్కడనుంచి అడ్డగూడూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకోని పోయి ఆమెను విఫరీతంగా కొట్టడంతో ఆమె చనిపోయారు. దాన్ని మార్చేందుకు ప్రయత్నం చేశారు. దీనిపై ప్రతిపక్షలు , ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రస్థాయిలో గొడవచేశారు. కాంగ్రెస్ పార్టీ డీజీపీ ని గవర్నర్ ను కూడా కలిసింది.

అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి , సీతక్క , తదితరులు పెద్ద ఎత్తున మరియమ్మ లాక్ డెత్ విషయం పై స్పందించారు. సీఎల్పీ నేత భట్టి ఆధ్వరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ల ఆధ్వరంలో చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి మరియమ్మ మృతిపై వివరించారు.స్పందించిన ముఖ్యమంత్రి మరియమ్మ కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం అందించడంతోపాటు , ఆమె కుమారుడికి ఉద్యోగం , 15 లక్షల సహాయం ఆమె ఇద్దరు కుమార్తెలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున 20 లక్షలు మొత్తం 35 లక్షల సహాయం అందించారు. డీజీపీ స్వయంగా ఖమ్మం వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని పరామర్శించారు. అంతే కనుకుండా దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశంనించారు. విచారణలో పోలిసుల తప్పు ఉందని తేలడంతో ఎస్ ఐ , ఇద్దరు కానిస్టేబుళ్ల ఉద్యోగాలను తొలగిస్తు ఉత్తర్వులు జారీచేశారు. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Related posts

ఏపీలో పొత్తులపై జాతీయ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు: పురందేశ్వరి

Ram Narayana

ఫుడింగ్ మింక్ పబ్ కేసును తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు…

Drukpadam

కర్ణాటకలో గాయని మంగ్లీ కారుపై రాళ్లదాడి…ఎలాంటి దాడి జరగలేదు మంగ్లీ!

Drukpadam

Leave a Comment