Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ అవినీతిపై పోరు కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయం!

టీఆర్ఎస్ అవినీతిపై పోరు కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయం
-మధుయాష్కీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం
-ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టికి కోకాపేట భూముల వ్యవహారం
-పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ, హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆధ్వర్వంలో నిన్న హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ చేస్తున్న అవినీతిపై పోరు కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే, కోకాపేట భూముల అవినీతిపై పోరాడేందుకు తదుపరి కార్యాచరణ రూపొందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కోకాపేట భూముల వేలంలో చోటుచేసుకున్న అవినీతిని ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నట్టు మధుయాష్కీ తెలిపారు.

పోడు భూముల రక్షణ కోసం కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ నిరసనలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వారిపై డీజీపీకి, హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేస్తామన్నారు. త్వరలోనే దళిత, గిరిజన, బీసీ దండోరా చేపడతామని, ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు దళిత దండోరా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు మధుయాష్కీ తెలిపారు. మరో నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రైతుల నుంచి విలువైన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని రైతులు వెళ్తే వారు కూడా ప్రైవేటు ఫాం హౌస్‌లలోనే ఉంటున్నారని ఆరోపించారు.

Related posts

ఇప్పుడు నా మీద పడతారు చూడండి.. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్!

Drukpadam

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ…

Drukpadam

తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ …ప్రోత్సహించింది చంద్రబాబు : విలేకర్లతో చిట్ చాట్ లో తుమ్మల …

Drukpadam

Leave a Comment