Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఎస్పీలో చేరనున్న మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్!

బీఎస్పీలో చేరనున్న మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్
-వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ప్రవీణ్ కుమార్
-ప్రస్తుతం రాష్ట్ర పర్యటన చేస్తున్న మాజీ ఐపీఎస్
-బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టే అవకాశం

ఇటీవలే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వయంగా వెల్లడించారు. ప్రవీణ్ కుమార్ కు మాయావతి ఆఫర్ ఇచ్చినట్టు ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని ప్రవీణ్ కుమార్ కు ఇచ్చేందుకు మాయావతి సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ వార్తలు నిజం కానున్నాయి. త్వరలోనే ఆయన బీఎస్పీలో చేరనున్నారు.

వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రవీణ్ కుమార్ రాష్ట్ర పర్యటన చేపట్టారు. స్వేరో సంస్థను ఆయన ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్వేరోలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే స్వేరో సంస్థలో దాదాపు 50 వేల మంది సభ్యులు ఉన్నారు.

వాస్తవానికి ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసినప్పుడు… ఆయన సొంత రాజకీయ పార్టీని పెట్టబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే సొంత పార్టీని అభివృద్ధి చేయడం కష్టంతో కూడిన పని కావడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్పీలో చేరాలని ఆయన నిర్ణయించుకోవడం, దానికి మాయావతి ఆమోదం తెలపడం జరిగిపోయాయి.

రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ విస్తరించే భాద్యతను ప్రవీణ్ కుమార్ భుజాలకు ఎత్తుకోనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీఎస్పీ కి అంతగా ఆదరణ లేదు . బీఎస్పీ పార్టీ ఉన్నట్లు చెబుతున్న దాని ఉనికి లేకపోవడం దళితులూ వివిధ పార్టీలలో ఉండటంతో తెలంగాణలో గాని ఆంధ్ర లో గాని బీఎస్పీ కి గుర్తింపు లేదు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ లాంటి ఒక నిజాయతి గల అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పార్టీని నడిపేందుకు సిద్ద పడటంతో కొంత బీఎస్పీ కి కలిసొచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాన్షిరాం ,మాయాతి లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితాలను ఇవ్వలేదు. ప్రవీణ్ కుమార్ స్వేరో ఎంతవరకు దళితులను ఏకం చేస్తుంది. మిగతా కులాల ఆదరణ ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

శీనన్న ఇంకెప్పుడన్న …

Drukpadam

ఓ పార్టీలో గెలిచి.. ఇంకో పార్టీలో చేరితే ఉరి శిక్ష వేయాలి: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

రాష్ట్రంలో కొన్ని వారాలైనా లాక్ డౌన్ పెట్టాలి…సీఎల్పీ నేత భట్టి

Drukpadam

Leave a Comment