- కఠిన చర్యలకు కేంద్రం నిర్ణయం
-38 కేసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు
-రైతు చట్టాలపై కేంద్రం కొత్త ఎత్తులు
-ఎర్రకోట ఘటన దురదృష్ట కరం-రైతుల ఐక్య కార్యాచరణ సమితి
-ఇది ముమ్మాటికీ కేంద్రం వైఫల్యమే -ప్రతిపక్షాలు
నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై జరుగుతున్న ఉద్యమం పై అటు ప్రభుత్వం ,ఇటు రైతుల ఐక్యకార్యాచరణ సమితి ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు . జనవరి 26 ఢిల్లీ లో జరిగిన రైతుల ట్రాక్టర్ల పెరేడ్ హింసాత్మకంగా మారటంతో ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటున్నారు. దీనితో అసలు విషయం పక్కదార్లు పడుతుంది . నిజంగా కేంద్రం కోరుకున్నది కూడా అదే . రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ ల ర్యాలీ నిర్వాయిస్తామని అనటం రైతుల తప్పు అయితే , దానికి అనుమతి ఇవ్వటం పోలిసుల తప్పని వాదనలు వినిపిస్తున్నాయి. అనుమతి ఇచ్చిన పోలీసులు లక్షలాది ట్రాక్టర్లు దేశరాజధాని ఢిల్లీకి ముందు రోజే చేరుకుంటే ఎందుకు తగిన జాగ్రత్తలు పోలీసులు తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి . ఏమైనా ఇప్పుడు వ్యవసాయ చట్టాల ముచ్చట పక్కకు పోయి . ఢిల్లీ ట్రాక్టర్ల ర్యాలీ , జరిగిన సంఘటనలు కేసులపై ఫోకస్ పెరిగింది. అందుకే ప్రతిపక్షాలు పార్లమంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బాయ్ కాట్ చేతం ద్వారా తిరిగి రైతు ఉద్యమం మీద ఫోకస్ వచ్చేలా చేయాలనీ ప్రయత్నాలు ప్రారంభించాయి . ఇందులో ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు.
రైతు ఉద్యమం పక్క దార్లు పట్టిందని అందుకు రైతు నాయకులే కారణమని వారిపై పెద్ద ఎత్తున కేసులు పెడుతుంది కేంద్రం . కేసులు పెట్టడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అల్లర్లకు భాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే కాని ఆపేరుతో ఉద్యమకారులపై వేధింపులు సరి అయినవి కావు అనేది ప్రతిపక్షాల వాదన . రైతు ఉద్యమం లేకుండా చేయాలనీ కేంద్రం తనకున్న అధికారములను ఉపయోగిస్తున్నది . 64 రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో ఉన్న రైతుల గుడారాలను తొలగిస్తుంది . ఇక్కడ నుంచి ఖాళీచేయాల్సిందేనని హుకుం జారీచేస్తుంది . ఎర్రకోట ఘటన, సాకుగా చూపి , ఘటనలకు సంభందం లేని ఉద్యమ కారులపై కేసులు పెట్టి వేధింపులకు దిగుతుంది కేంద్రం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 38 కేసులను వివిధ సెక్షన్ల కింద నమోదు చేశారు. వందలాది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిపై దేశద్రోహంతో సహా అనేక కేసులతో వేధింపులకు గురిచేసే ప్రయత్నం చేసుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటం అద్వీతీయం అనిర్వచనీయం .రాజకీయాలతో సంభందం లేదు , 64 రోజుల పాటు ఒక్క హింసాత్మక ఘటన లేకుండా చేసిన పోరాటానికి జేజేలు పలుకుతున్నారు ప్రజలు . ఈ ఉద్యమంలో సుమారు 150 మంది రైతులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు . ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా వ్యవసాయ చట్టాల రద్దు చేయాల్సిందేనని దీక్షబూనారు. చలిని , వర్షాన్ని ,ఎండను సైతం లెక్కచేయకుండా , మైనస్ డిగ్రీ ల ఉష్ణోగ్రతలో చేసినపోరాటం వారి ఉద్యమ స్ఫూర్తిని తెలియజేస్తున్నది . జనవరి 26 రిపబ్లిక్ డే సందర్బంగా జరిగిన అల్లర్లు ఖండించతగ్గవే . హింస సమస్యకు పరిస్కారం కాదు . ఉద్యమంలో కొన్ని దుష్ట శక్తులు చేరాయనేది అందరు అంగీకరిస్తున్నదే . ఇందులో మరో మాటకు తావులేదు. అంత మాత్రాన ఉద్యమం అంతా చెడ్డదైపోదు . రైతుల డిమాండ్లు పక్కకు పోవు. కొన్ని సంఘటల ఆధారంగా కేంద్రం కక్షసాధింపు చర్యలకు పూనుకుంటే మరింత మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అల్లర్లకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే . వారిని గుర్తించేందుకు నిస్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి . అంతేగాని అల్లర్ల సాకుతో కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను కొనసాగింప చూస్తే మరిన్ని ఉద్యమాలు వచ్చే ఆవకాశం ఉంది . 64 రోజుల పాటు ఎంతో క్రమశిక్షణతో చేసిన ఉద్యమం ఒక్క ఘటనతో దారితప్పిందని చెప్పటం కుంటిసాకు మాత్రమేననే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. రెండు మూడు రాష్ట్రాల రైతులు మాత్రమే ఉద్యమం లో ఉన్నారని ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టు కు చెప్పటంలోనే కేంద్రం ఉద్దేశం అర్థం అవుతుందని అభిప్రాయాలూ ఉన్నాయి. కేంద్రం ఎంత సేపటికి రైతులను వెనక్కు తగ్గమని చెబుతున్నది తప్ప తాము చేసిన చట్టాలను వెనక్కు తీసుకునేందుకు ఇష్ట పడటం లేదు. ఇంత మొండిగా కేంద్రం వ్యవహరించటం పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ చట్టాలు కేవలం కార్పొరేట్ శక్తులకోసమేనని , అందులో ప్రత్యేకించి అంబానీ, అదానీల కోసమేనని రైతులు నమ్ముతున్నారు.
రైతు సంఘాల సంయుక్త ఐక్య కార్యాచరణ సమితి ఢిల్లీ సరిహద్దులలో వ్యవసాయ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా జరిపిన ఉద్యమం ప్రశంసనీయం . 150 మంది రైతులు చనిపోయినా, ఉద్యమం చెక్కు చెదరలేదు. మరింత పట్టుదల పెరిగింది. బహుశా ప్రపంచ చరిత్రలో ఇంత క్రమశిక్షణగా జరిగిన ఉద్యమం లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉద్యమం ఎన్నో పాఠాలు నేర్పింది. నీరశింసించి పోతున్న ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోసింది. ప్రజలు తలచుకుంటే పాలకులు దిగిరాక తప్పదనే సందేశాన్ని ఇచ్చింది . ఒక ప్రశ్నకు అనేక సమాధానాలు అన్నట్లుగా ఒక ఉద్యమం అనేక ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. పోరాడితే పోయేది ఏమిలేదు బానిస సంకెళ్లు తప్ప అనే మార్క్స్ మహనీయుడు చెప్పింది అక్షర సత్యమని రుజువు చేసింది . రైతుల సమస్యలపై దేశం యావత్తు ఢిల్లీ ఉద్యమం వెంట నడిచింది . మహారాష్ట రైతులు నాసిక్ నుంచి ముంబైకి చేసిన లాంగ్ మార్చ్ , కేరళ అసెంబ్లీ రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేసిన తీర్మానం , తెలంగాణ ప్రభుత్వం రైతు బంద్ లో పాల్గొనటం , మహారాష్ట్ర, బెంగాల్ , ఒడిశా ప్రభ్యత్వాలు ఇచ్చిన మద్దతు చరిత్ర లో నిలిచిపోతాయి. అందుకే తాత్కాలికంగా ఉద్యమానికి విరామం ఇచ్చిన రైతు గెలిచాడు ,నిలిచాడు అనేది ఢిల్లీ ఉద్యమం చాటి చెప్పిందనే అభిప్రాయాలే బలంగా ఉన్నాయి. దీన్ని కేంద్రం గమనిస్తుందో లేదో చూద్దాం ???