రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్ కాట్ చేయాలని 16 రాజకీయ పార్టీల నిర్ణయం
– నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే
పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్ కాట్ కు 16 రాజకీయ పార్టీల నిర్ణయించాయి . నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. గురవారం ఢిల్లీలో వర్చువల్ గా జరిపిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ , వ్యవసాయ చట్టాలకు నిరసనగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి చేసేప్రసంగాన్ని బావిష్కరించాలని 16 రాజకీయపార్టీలు నిర్ణవించాయని తెలిపారు. రైతుల ఆందోళనకు సిపిఎం మద్దతు ఉంటుందని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమం రాజకీయాలకు అతీతంగా జరిగిందని అన్నారు. తమ పార్టీతో సహా అనేక పార్టీలు ఉద్యమానికి మద్దతు ఇచ్చాయని అన్నారు. వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్ లో ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. సంభందిత వర్గాలను సంప్రదించకుండానే ఏకపక్షంగా కేంద్రం చట్టాలను తెచ్చిందన్నారు. ఈ చట్టాలు రైతుల మనుగడను ప్రస్నార్ధకం చేయనున్నయన్నారు. ఢిల్లీ అల్లర్లు కావాలని రైతు ఉద్యమ కార్యాచరణ కమిటీ చేయించింది కాదన్నారు. కేంద్రం కూడా దీనికి భాద్యత వహించాలన్నారు. లక్షలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటంలో కేంద్రం వైఫల్యం ఉందన్నారు. ప్రపంచంలోనే పెద్ద ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉన్న మనం రైతు ఉద్యమం లో అల్లరిమూకలు చొరబడ్డాయని ఎందుకు గుర్తించలేదన్నారు . ఇది ముమ్మాటికీ కేంద్ర వైఫల్యమే అన్నారు. గతంలో కూడా రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటాలు చేసిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు.
previous post
next post