Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడండి… ఢిల్లీలో ప్లకార్డులు చేతబూనిన వైసీపీ ఎంపీలు…

విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడండి… ఢిల్లీలో ప్లకార్డులు చేతబూనిన వైసీపీ ఎంపీలు
-ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ధర్నాలో పాల్గొన్న టీడీపీ ఎంపీలు
-విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
-కేంద్రం పునరాలోచించుకోవాలంటున్న పోరాట కమిటీ
-మద్దతు పలికిన వైసీపీ,టీడీపీ ఎంపీలు
-ధర్నాలో పాల్గొన్న విజయసాయి తదితరులు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం కృతనిశ్చయంతో ఉండగా, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఢిల్లీలో ధర్నా చేపడుతోంది. ఈ ధర్నాకు వైసీపీ ఎంపీలు మద్దతు పలికారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసే నిర్ణయం పట్ల కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని వారు నినాదాలు చేశారు. విజయసాయిరెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకటరమణ, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ ఈ ధర్నాలో పాల్గొన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం తీవ్రరూపు దాల్చుతోంది. ఉక్కు పరిశ్రమ పోరాట కమిటీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరుపుతుండగా, ఏపీ ఎంపీలు మద్దతుగా తాము కూడా ధర్నాలో పాల్గొంటున్నారు. వైసీపీ ఎంపీలు ఇప్పటికే పోరాట కమిటీకి మద్దతు ప్రకటించారు.

తాజాగా, టీడీపీ ఎంపీలు కూడా జంతర్ మంతర్ వద్దకు వెళ్లి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ విశాఖ ఉక్కు పోరాట కమిటీకి సంఘీభావం తెలిపారు. ఐక్యంగా పోరాడి విశాఖ ఉక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు పార్లమెంటులోనూ, బయటా పోరాడతామని స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

రాష్ట్రానికి కేటీఆర్ సీఎం …దేశానికి ప్రధాని కేసీఆర్ …శాసనసభలో మంత్రి మల్లారెడ్డి …

Drukpadam

అసోం సీఎం గా హిమంత బిశ్వశర్మ…

Drukpadam

డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ ,వైసీపీ మధ్య మాటల యుద్ధం ….

Drukpadam

Leave a Comment