Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఈ నెలలోనే కరోనా థర్డ్ వేవ్ .. ఐఐటీ పరిశోధకుల హెచ్చరిక!

ఈ నెలలోనే కరోనా థర్డ్ వేవ్ .. ఐఐటీ పరిశోధకుల హెచ్చరిక
-అక్టోబరులో గరిష్ఠ స్థాయిని తాకనున్నఉద్ధృతి
-రోజుకు లక్షల వరకు కేసుల నమోదు
-వ్యాక్సినేషన్ జోరు పెంచాలంటున్న నిపుణులు
-ప్రస్తుతం రోజుకు 40 వేలకు పైగా కేసులు
-కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌ను సమర్థంగా అడ్డుకుంటున్న కొవాగ్జిన్
– డెల్టా, డెల్టా ప్లస్ రకాలను సమర్థంగా అడ్డుకుంటున్న టీకా

రెండో దశలో దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన కరోనా వైరస్ మూడో దశలో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందని హైదరాబాద్, కాన్పూరు ఐఐటీ పరిశోధకులు హెచ్చరించారు. అయితే, రెండో దశతో పోలిస్తే దీని తీవ్రత కొంత తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పడం కొంత ఊరటనిచ్చే అంశం.

ఈ నెలలోనే తాకే మూడో ఉద్ధృతి.. అక్టోబరులో తీవ్రస్థాయికి చేరుతుందని అంచనా వేశారు. ఆ సమయంలో దేశంలో రోజువారీ కేసుల సంఖ్య లక్షలోపు ఉంటుందని వివరించారు. అయితే, పరిస్థితి మరింత దిగజారితే కనుక కేసుల సంఖ్య 1.5 లక్షల వరకు చేరుకుంటుందని విద్యాసాగర్ (హైదరాబాద్ ఐఐటీ), మణీంద్ర అగర్వాల్ (కాన్పూరు ఐఐటీ) నేతృత్వంలోని బృందం వివరించింది.

దేశంలో ఈ ఏడాది మే 7న సెకండ్ వేవ్ గరిష్ఠస్థాయిని తాకింది. అప్పట్లో రోజుకు అత్యధికంగా 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. థర్డ్ వేవ్‌కు అడ్డుకట్ట వేసేందుకు వైరస్ హాట్‌స్పాట్లను గుర్తించాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. రెండో దశ మొదలై ఇప్పటికి 5 నెలలు గడిచాయి. ప్రస్తుతం 40 వేల కేసులు నమోదవుతున్నాయి. వీటిలో దాదాపు సగం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో కనుక ఇన్ఫెక్షన్లు పెరిగితే కేసుల సంఖ్య మరోమారు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌ను సమర్థంగా అడ్డుకుంటున్న కొవాగ్జిన్

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారత బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రమాదకర డెల్టా ప్లస్ వేరియంట్‌పైనా ప్రభావం చూపుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. డెల్టా, డెల్టా ఏవై-1, బి.1.617.3 రకం వైరస్‌లపై కొవాగ్జిన్‌ను పరీక్షించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా ‘బయోరిగ్జివ్’ సైన్స్ వెబ్‌సెట్‌ ఓ వ్యాసాన్ని ప్రచురించింది. దేశంలో రెండో దశ ఉద్ధృతికి డెల్టా వేరియంటే కారణమని ఇప్పటికే తేలింది. ఆ తర్వాత అది మళ్లీ రూపాంతరం చెంది డెల్టా ప్లస్‌గా మారింది. ఈ వేరియంట్‌పై కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నట్టు ఐసీఎంఆర్ తెలిపింది.

Related posts

ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ దన్ను…

Drukpadam

పీఎం కేర్స్ ఫండ్ కు 50 వేల డాలర్లు విరాళం … ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్

Drukpadam

ఏపీలో నైట్ కర్ఫ్యూ.. ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్

Drukpadam

Leave a Comment