Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల మంగళవారం దీక్షలు … మూస పద్దతిలో విమర్శలు…

షర్మిల మంగళవారం దీక్షలు … మూస పద్దతిలో విమర్శలు…
-దూరం అవుతున్న కార్యకర్తలు … ఇప్పటికే గుడ్ బై చెప్పిన కొందరు
-కేసీఆర్ టార్గట్ గా షర్మిల ఉద్యమాలు …. ప్రతిసారి అవే డైలాగులు
-వంద‌లాది మంది నిరుద్యోగులు చ‌నిపోతున్నా కేసీఆర్‌లో చ‌ల‌నం లేదు
-నిరుద్యోగుల‌కు ఏమైతే నాకేం? అనుకుంటున్నారు
-కండ్ల ముందే ల‌క్షా 91వేల ఖాళీలు
-వాటిని భ‌ర్తీ చేయ‌డం లేదు

తెలంగాణాలో రాజన్న రాజ్యస్థాపనకోసం వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల ఖమ్మం సభనుంచి తన కార్యకలాపాలు ప్రారంభించారు. అంతకుముందు కేవలం ఇండోర్ మీటింగులకే పరిమితమైన ఆమె తర్వార నిరుద్యోగ సమస్యలపై గళం విప్పారు .సమస్య మంచిదే అయినప్పటికీ ఎందులో అనుకున్నంత స్పందన రావడంలేదని అభిప్రాయాలే ఉన్నాయి. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నమాట కాదనలేని సత్యం. తెలంగాణాలో వైయస్సార్ కు అభిమానులు ఉన్న మాట నిజం …. అభిమానం వేరు …పార్టీ వేరు …. అందులో తండ్రి పై ఉన్న అభిమానం కూతురు మీద చూపించాలని ఏమి లేదు.అందులో పార్టీ పెట్టిన కూతురు పై చూపించాలని లేదు . అయితే ఆమె చూపించాలని కోరుకోవడంలో తప్పులేదు. ఆమె పార్టీ పెట్టి రాజన్న సంక్షేమ రాజ్యాన్ని తెచ్చినందుకు చేస్తున్న కృషిని అభినందిచాల్సినే . కాని ప్రస్తతం ఉన్న పరిస్థిలో ఆమె పార్టీ కేసీఆర్ లాంటి అపర చాణిక్యున్ని ,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని , ఇప్పటికి బడుగు బలహీన వర్గాలలో అంతో ఇంతో పట్టు ఉన్న కాంగ్రెస్ ని కాదని షర్మిల పార్టీ మనగలుగుతుందా ? అనేది రాజకీయపండితుల అభిప్రాయం .

షర్మిల పార్టీ పేరు , జెండా ,ఎజెండా ప్రకరించారు. నిరుద్యోగ సమస్యపై రాష్ట్రలో మిగతా పార్టీలు పట్టించుకోకపోయినా ఆమె మంగళవారం ,మంగళవారం దానిపై జిల్లాలకు వెళ్లి దీక్షలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. దీనికి నిరుద్యోగుల నుంచి ప్రశంసంలు ఉన్నాయి. మా సమస్యలపై ఆమె స్పందిస్తున్నారని నిరుద్యోగులు కొంత ఊరట చెందుతున్నారు. అయితే ఆమె ఉద్యమాలకు నిరుద్యోగులనుంచి కూడా అనుకున్నంత స్పందన రావడం లేదు. పైగా మూస పద్దతిలో ఆమె ఉపన్యాసాలు ఉంటున్నాయని అభిప్రాయాలు ఉన్నాయి. నిరంతరం కేసీఆర్ ను దొరా అనడం కూడా ప్రజలకు ఎక్కడం లేదు . ఆమె అంటున్న వ్యంగ్యం మాటలు రుచించడంలేదు. కేసీఆర్ ను విమర్శించడం లో టీఆర్ యస్ కు తప్ప ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు . మూస పద్దతిలో విమర్శలు ఒకసారి రెండు సార్లకు పనికొస్తాయి తప్ప ప్రతిసారి పనికి రావనేది షర్మిల గుర్తించితే మంచిది …

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి లో దీక్ష సందర్భంగా

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘వంద‌లాది మంది నిరుద్యోగులు చ‌నిపోతున్నా కేసీఆర్‌లో చ‌ల‌నం లేదు. నిరుద్యోగుల‌కు ఏమైతే నాకేం? నా ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి క‌దా అని మురిసిపోతున్నారు. కండ్ల ముందే ల‌క్షా 91వేల ఖాళీలున్నా.. వాటిని భ‌ర్తీ చేయ‌డం లేదు. నిరుద్యోగుల ప‌క్షాన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పోరాడుతూనే ఉంటుంది’ అని ష‌ర్మిల స్ప‌ష్టం చేస్తూ ఈ రోజు ట్వీట్ చేశారు.

కాగా, తెలంగాణ‌లో ల‌క్షా 91వేల ఉద్యోగ‌ ఖాళీలను భ‌ర్తీ చేయాల‌ని వైఎస్‌ ష‌ర్మిల ప్ర‌తి మంగ‌ళ‌వారం దీక్ష చేస్తోన్న విష‌యం తెలిసిందే. అలాగే, రాష్ట్రంలోని 54 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లెలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమెను ప‌లువురు మ‌హిళ‌లు క‌లిశారు. అందుకు సంబంధించిన ఫొటోను ష‌ర్మిల ఈ రోజు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Related posts

జగన్ ,షర్మిల మధ్య విబేధాలు…?

Drukpadam

ఎందుకీ అనవసర ఉపన్యాసం?: ప్రధాని మోదీ ప్రసంగంపై ఒవైసీ వ్యంగ్యం…

Drukpadam

ఆఫ్ఘన్​ ప్రభుత్వ పగ్గాలు బరాదర్​ కే!

Drukpadam

Leave a Comment