Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ ముఖ్య నేతలకు బీజేపీ గాలం?

ఖమ్మం టీఆర్ యస్ ముఖ్య నేతలకు బీజేపీ గాలం?
-జాబితాలో తాజాలు,మాజీలు సైతం
-ఒక నేతకు కేంద్ర మంత్రి ఆఫర్
-చక్రం తిప్పుతున్న బీజేపీ అగ్రనేత్రి
-అడ్డుపడుతున్న మరోనేత
తెలంగాణ రాష్ట్రంపై బోలెడు ఆశలతో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ , అధికార టీఆర్ యస్ ముఖ్యనేతలపై గురిపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో అధికార టీఆర్ యస్ ముఖ్య నేతలు బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కొందరు ఖండిస్తున్నా మరికొందరు మౌనంగా ఉన్నారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఉన్న ముఖ్యనేతలను టార్గెట్ చేసిందనేది విశ్వసనీయమైన సమాచారం. ఇందుకోసం కొందరు నాయకులూ నిరంతరం పనిచేస్తున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నాటికే కొంత మందిని పార్టీలో చేర్చుకోవాలని చేస్తున్నప్పటికీ పెద్దనాయకులనుంచి పెద్దగా స్పందన లేకపోవటం గమనార్హం . ఖమ్మం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పర్యటన తరువాత పార్టీకి కొంత సానుకూల వాతావరణం ఉందని విశ్వాసంతో ఉన్నారు . పార్టీలో చేరికల కోసం ఒక టీమ్ ను ఏర్పాటు చేసిన బీజేపీ తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు ఒకరు ఖమ్మం మీద పూర్తీ కేంద్ర కరణ చేశారు. ఆయన ఇప్పటికే అనేక మందిని కలిశారు. గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీచేసిన ప్రస్తుత కాంగ్రెస్ నేతతో చర్చలు జరిపారు. ఒక గ్రానైట్ అధినేత, ప్రస్తుత టీఆర్ యస్ నాయకులతో టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీమంత్రి డి.కే అరుణ గతంలో తనకున్న పరిచయాలతో పలువురితో మాట్లాడుతున్నారు . ఆమె తెలంగాణాలో బీజేపీ లోకి నేతలను ఆహ్వానించేపనిలో ఉన్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ లోని అసంత్రుప్తులను గుర్తించి వారితో చర్చించి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు . ఇప్పటికే ఆమె ఈ విషయంలో కొంత సక్సెస్ అవ్వటంతో బీజేపీ అగ్ర నాయకత్వం ఆమెకు మరిన్ని భాద్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది . ఖమ్మం జిల్లా ప్రస్తుతం టీఆర్ యస్ కు అనుకూలంగా ఉంది.అదే సందర్భంలో అసంతృపుత్తులు అదేస్థాయిలో ఉన్నాయి. అందరిని అన్నిరకాలుగా సంతృప్తి పరచటం టీఆర్ యస్ కు సైతం ఇబ్బందిగానే ఉంది. రేపు పదవులు వస్తాయనే గ్యారంటీ కూడాలేదు . అందువల్ల బీజేపీ దీన్ని ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఒక మాజీ ఎంపీ , మాజీమంత్రి , ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మరికొందరిపై ఫోకస్ పెట్టింది. కొందరితో బీజేపీ ముఖ్యనేతలు నేరుగానే సంప్రదించారు. మరికొందరితో ఫోన్ సంభాషణలు జరిగాయి. మరికొందరికోసం వారికీ దగ్గరిగా ఉన్న నేతల ద్వారా గాలం వేస్తున్నారు. ఒక ముఖ్య నేత విషయంలో కేంద్ర మంత్రి అడ్డుపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన్ను బీజేపీలో కి ఆహ్వానిస్తే తనకు ఇబ్బంది ఉంటుందని ఆయన ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది. దీనిపై బీజేపీ ఢిల్లీ పెద్దలు సైతం ఆరా తీసినట్లు సమాచారం .ప్రజాబలం ఉన్ననేతను బీజేపీలోకి ఆహ్వానించటం ద్వారా జిల్లా రాజకీయాలను మార్చ వచ్చుననే అభిప్రాయంతో ఉంది. అంతే కాకుండా మాజీమంత్రిని కూడా బీజేపీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు. అందుకు వారికీ దగ్గరగా ఉండే వారితో రాయబారాలు పంపిస్తున్నాను. ఇక ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలపై ద్రుష్టి పెట్టారు. ఒక మాజీ ఎమ్మెల్యే తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది . ఆయన ఇంటికి పలువురు బీజేపీ ముఖ్య నేతలు వెళ్లి చర్చలు జరిపినట్లు సమాచారం.అయితే ఇప్పటి వరకు నాయకులూ మాత్రం బీజేపీకి ఏలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం . వారిపై మరింత వత్తిడి పెంచేందుకు తీవ్రప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాకు బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో పాటు మరికొందరు నేతలను రప్పించే ఆలోచన బీజేపీ నాయకత్వం చేస్తుందని తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు బీజేపీ నుంచి టీఆర్ యస్ కు ముప్పు లేక పోయినప్పటికి ముందు ముందు ఉండే ఆవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.

Related posts

ఎమ్మెల్సీ పదవి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నాననడం హాస్యాస్పదం: ఎల్.రమణ!

Drukpadam

ఉత్తరాఖండ్ సీఎం మార్పు … నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామి…

Drukpadam

వచ్చే ఎన్నికల్లో తప్పకుండ పోటీచేస్తానన్న డీఎల్ రవీంద్రారెడ్డి…

Drukpadam

Leave a Comment