Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పెన్షనర్లను పేదలుగా మార్చిన పీఆర్సీ

పెన్షనర్లను పేదలుగా మార్చిన పీఆర్సీ
-ఉద్యోగులను పెప్పించని వైనం
-సర్కార్ తీరుపై ఉద్యోగుల కన్నెర్ర
తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ నివేదిక పెన్షనర్లను పేదలుగా మార్చేదిగా ఉందిని రాష్ట్ర పెన్షనర్ల సంఘం మండిపడింది . ఇంత దారుణమైన పీఆర్సీ ని తాము ఎప్పుడు చూడలేదని వారు అంటున్నారు. ఏదైనా పీఆర్సీ వస్తుందంటే ఉద్యోగులు పెన్షనర్లు సంతోషపడాలి .కానీ అందుకు భిన్నంగా పీఆర్సీ నివేదిక ఉండటంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ఆసలు పీఆర్సీ నివేదికను తయారు చేసే కమిటీ వాస్తవాలను పరిశీలించటం లేదనే సందేహాలు కలుగుతున్నాయి. పాట రిపోర్ట్ లనే అంకెలు మార్చడం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఉంటుంది. ఐదుసంవత్సరాల ఉద్యోగుల భవిషత్ కు సంభందించిన వేతన సవరణకు కరోనా ఒక సంవత్సరం ఆదాయానికి ముడి పెట్టటం ఏమిటనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. కేవలం ఉద్యోగులకు జీతాలు తగ్గించాలని ఒకేఒక దురుద్దేశమే ఇందులో కనపడుతుందని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగ సంఘనేతలు సైతం ఉద్యోగుల సమస్యల పై సరిగా రెప్రజెంట్ చేయలేక పోతున్నారని ఉద్యోగులు భావిస్తున్నారు. ఫలితంగా కేసీఆర్ సర్కార్ తీరుకు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పీఆర్సీ ఏ రాష్ట్రంలో కూడా లేదని అంటున్నారు. మననుండి వీడిపోయిన ఆంధ్ర ప్రదేశంలో గత ఏడాది 27 శాతం ఐ ఆర్ ప్రకటించగా తెలంగాణాలో మాత్రం ఇంతవరకు ఐ ఆర్ ప్రకటించలేదు సరి కదా పీఆర్సీ ని కేవలం 7 .5 శాతం ప్రకటించటం ఉద్యోగులను అవమానించటమే నేనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. పీఆర్సీ లో ఫిట్ మెంట్ 63 శాతంగా ఉండాలని ఉద్యోగసంఘాల కోరితే కేవలం 7 .5 శాతం ప్రకటించారు. పైగా అప్పులు కరోనా పేరుతో దాన్ని సమర్దిన్చుకునే ప్రయత్నం చేస్తున్నారు . కనీస పెన్షన్ 15000 వేల రూపాయలు ఉండాలని కోరితే 9500 చేశారు. రిటైర్ అయినా ఉద్యోగులకు 20 లక్షల గ్రాట్యూయూటీ అడిగితే 16 లక్షలకు సిపార్సు చేశారు. కమ్యూటేషన్ 50 శాతం పెచాలని, ఫ్యామిలీ పెన్షన్ 30 నుంచి 50 శాతానికి పెంచాలంటే స్పందనలేదు. 70 సంవత్సరాలు దాటినా వారికీ 15 అదనపు పెన్షన్ 10 పీఆర్సీ ప్రతిపాదిస్తే అతీగతీ లేదు. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న మనరాష్ట్రంలో తెలిసారి ఆదంకూడా వెక్కువగానే ఉంది. కానీ మన రాష్ట్రం కన్నా తక్కువ తలసరి ఆదాయం ఉన్న కేరళ ప్రభుత్వం 11 వేతన సవరణ సంఘం సిపార్సులను 2019 నుంచే అమలు చేస్తున్నది. అక్కడ సిపిఎం నాయకత్వంలోని పినరాయి విజయన్ ప్రభుత్వం మినిమమ్ వేజ్ 23000 గాను మాక్సిమం వేజ్ 166800 వేల రూపాయలుగా నిర్ణయించింది. కంటింజెంట్ ఉద్యోగుల వేతనం 22970 నిర్ణయించారు, ఇతర అన్ని రకాల వేతనాలు పెంచింది.పెన్షనర్లకు కూడా అన్ని రకాలుగా వరాలు కురిపించింది కేరళ ప్రభుత్వం .తక్కువలో తక్కువ పెన్షన్ 11500 నుంచి 83400 వరకు ఉంది. ఫ్యామిలీ పెన్షన్ 11500 నుంచి 50040 వరకు ఉంది. ఇక పీఆర్సీ లో గ్రాట్యూయూటీ ని 14 లక్షల నుంచి 17 లక్షలకు పెంచారు. మిగతా రాష్ట్రాలలో కూడా పెంపుదల ఉండగా మన తెలంగాణాలో అత్యంత అవమానకర రీతిలో పీఆర్సీ ప్రతిపాదనలు ఉండటంపై ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. కొందరు నేతలవల్లనే మొత్తం ఉద్యోగులు నష్ట పోతున్నారని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. దీన్ని సీఎం కేసీఆర్ సరి చేస్తారని కొందరు ఉద్యోగ సంఘ నేతలు, మంత్రి శ్రీనివాసగౌడ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ముఖ్యమంత్రి పీఆర్సీ ని పెంచుతారని చెబుతున్న అది ఎంతవరకు పెంచుతారు అనేది చెప్పలేని పరిస్థితి. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం తాము ప్రస్తుత పీఆర్సీ ని ఎట్టి పరిస్థితి లో ఒప్పుకోబోమని గత పీఆర్సీ 43 శాతం ఇచ్చినందున ఇప్పుడు కనీసం 45 శాతం ఉండాలని సి యస్ సోమేశ్ కుమార్ వద్ద జరిగిన చర్చలలో తేల్చి చెప్పారు.

Related posts

ప్ర‌పంచంలో అందరికంటే ఎక్కువ ఆదరణ ఉన్న దేశాధినేత ప్రధాని మోడీ!

Drukpadam

యుద్ధ విమానం కూలిపోతే ఇంట కథ ఉందా?

Drukpadam

.పెళ్లి పీటల మీదకు తాగివచ్చిన వరుడు … పెళ్లి రద్దు …

Drukpadam

Leave a Comment