తెలంగాణ ఏపీ లలో భారీగా పెరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు…
శాససభలో 119 నుంచి 179 కి,263 లోకసభలో 12 నుంచి 26 కు పెరగనున్న సీట్లు
ఏపీలో 175 నుంచి 263 శాససభలో లోకసభ సీట్లు 25 నుంచి 38 కి పెరగనున్నాయి ..
816 కు పెరగనున్న లోకసభ సీట్లు …
వచ్చే లోకసభ ఎన్నికల లోపే నియోజకవర్గాల పునర్విభజన నియోజకవర్గాల పెంపు , మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎన్డీయే కూటమి కృతనిశ్చయంతో ఉంది .ఇందుకు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని నిర్ణయించుకుంది ..
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు
ప్రస్తుతం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలున్నాయి. 50 శాతం సీట్లు పెరగనున్నాయి.
దీంతో ఏపీలో 88 అసెంబ్లీ స్థానాలు పెరిగి… 263కు చేరుకుంటాయి.
అలాగే లోక్‌సభ సీట్ల సంఖ్య 13 పెరిగి…38కి చేరుకుంటాయి.
తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలున్నాయి.
60 అసెంబ్లీ స్థానాలు పెరిగి…ఆ సంఖ్య 179కి చేరుకుంటుంది.
లోక్‌సభ స్థానాలు 9 పెరిగి, ఆ సంఖ్య 26కి చేరుకుంటుంది.
ఈ సమావేశాల ముగుంపు లోపు గానీ లేదా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లు ఆమోదించాలని యోచనలో ఉంది …ఇప్పటికే దీనికి సంబందించిన ప్రాధమిక పని పూర్తీ చేసుకొని పార్లమెంట్ లోపల బయట చర్చలు జరిపేలా కేంద్ర వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది …ఇప్పుడు ఉన్న పార్లమెంట్ స్థానాలకు అదనంగా 50 శాతం పెరగనున్నాయి ..
2011 జనాభా లెక్కల ఆధారంగానే..
గతేడాది సెప్టెంబర్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించిన “నారీ శక్తి వందన్ అధినియం” ప్రకారం జనాభా లెక్కలు పూర్తయి, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభుత్వం తన ప్రణాళికను మార్చుకుంది. జాప్యాన్ని నివారించేందుకు, రాబోయే జనాభా లెక్కల కోసం ఎదురుచూడకుండా, 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్‌కు సంబంధించిన మరో బిల్లును తీసుకురానుంది.
రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఈ నేపథ్యంలో మద్దతు కూడగట్టే బాధ్యతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా చేపట్టారు. సోమవారం ఆయన ఎన్డీయే పక్షాలతో పాటు వైసీపీ, బీజేడీ, సమాజ్‌వాదీ పార్టీ వంటి విపక్ష పార్టీలతో కూడా వేర్వేరుగా సమావేశమయ్యారు. అయితే, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. మహిళా కోటాలో ఓబీసీలకు కూడా ఉప-కోటా ఉండాలని కాంగ్రెస్, ఎస్పీ వంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
వచ్చే లోక్‌సభ ఎన్నికల (2029) నుంచి చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన రెండు బిల్లులను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ఒక సరికొత్త ఫార్ములాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం లోక్‌సభలోని ప్రస్తుత 543 స్థానాలను 50 శాతం పెంచి, మొత్తం 816కి చేర్చనున్నారు. కొత్తగా పెరిగే 273 సీట్లను పూర్తిగా మహిళలకు కేటాయిస్తారు. తద్వారా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళా కోటాను అమలు చేయవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.